ETV Bharat / state

BANDI SANJAY: కాళేశ్వరం పేరుతో సీఎం ఫామ్​హౌస్​కు పైపులైన్: బండి సంజయ్

author img

By

Published : Aug 5, 2022, 4:34 AM IST

Updated : Aug 5, 2022, 5:07 AM IST

BANDI SANJAY
BANDI SANJAY

BANDI SANJAY:కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ఫామ్​హౌస్​కు పైపులైన్ వేసుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం పెద్ద పలుగు తండాలో గిరిజనుల బతుకుల భరోసాకై రచ్చ బండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

BANDI SANJAY: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఆయన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ఫామ్​హౌస్​కు పైపులైన్ వేసుకున్నారని ఆరోపించారు. . తన ఫామ్​హౌస్​లో నీటి కోసం అక్షరాల లక్షా 30 వేల కోట్లు ఖర్చు చేశాడని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం పెద్ద పలుగు తండాలో గిరిజనుల బతుకుల భరోసాకై రచ్చ బండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రచ్చబండలో గిరిజనుల సమస్యలు బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలన్నారు. మీరు గతంలో చేయి గుర్తుకు, కారు గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేశారు, ఈసారి పువ్వు గుర్తుకు ఓటు వేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. గుర్రంపోడులో రైతుల భూములు తీసుకుని.. 60 మందిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఇందులో పురుషులు స్త్రీలు, గర్భిణులు కూడా ఉన్నారు. కేసీఆర్ దళితులకు 3 ఎకరాల ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులకు ఉన్న భూమి ప్రభుత్వం తీసుకోకుంటే చాలన్నారు.

భువనగిరి టీచర్స్ కాలనీ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాద యాత్ర, వర్షం కురుస్తున్నప్పటికీ మధ్యాహ్నంకి ముగ్దుమ్​పల్లికి చేరుకుంది. భోజన విరామం అనంతరం సాయంత్రం బండి సంజయ్ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. పాదయాత్ర బీబీనగర్ మండలం చిన్న పలుగు తండాకి చేరుకోగానే గ్రామస్తులు బండి సంజయ్​కి గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం పెద్ద పలుగు తండాకు చేరుకున్న బండి సంజయ్ ఓ పూరి గుడిసెలో నివసిస్తున్న కుటుంబాన్ని పలకరించారు. వారి వివరాలు కనుకున్నారు. అదే గ్రామంలో వృద్ధులు నివసిస్తున్న మరో పూరి గుడిసెని సందర్శించిన ఆయన, వారి స్థితి గతులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద లందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పెద్ద పలుగు తండాలో ఏర్పాటు చేసిన గిరిజనుల బతుకు భరోసా క రచ్చ బండ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొనున్నారు.ఈ

కరోనా కాలంలో మీరందరూ వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఒక్కో ఇంజక్షన్ ధర 1200 నుంచి 1500 రూపాయలుంటే ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఊర్లలో బెల్టు షాపులు, వైన్ షాపులు ఎక్కువైపోయాయని.. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. పెద్ద పలుగు తండాకు సమీపంలో ఉన్న బొల్లేపల్లి కాల్వని ఎందుకు మరమ్మతులు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్దపలుగు తండాకు చేసిన పనుల వివరాలను ప్రజలకు వివరించారు. మోదీ ప్రభుత్వం 19 లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద కూలీలకు అందించారని.. వైకుంఠ దామాలు, రైతు వేదికలకు 28 లక్షల రూపాయలు, మొక్కల పెంపకానికి రూ.12 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు 39 కుటుంబాలకు రూ.10 లక్షలు అందించారని గుర్తు చేశారు.

ఇవీ చదవండి: మునుగోడులో కలకలం.. కోమటిరెడ్డి స్వగ్రామానికి చెందిన యువకుడిపై కాల్పులు

నదిలో చిక్కుకున్న వృద్ధ జంట.. తాళ్లతో కాపాడిన సహాయక సిబ్బంది

Last Updated :Aug 5, 2022, 5:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.