ETV Bharat / state

అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

author img

By

Published : Jan 18, 2021, 1:30 AM IST

Seized illegally stored gutka packets in warangal district
అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

వరంగల్ పట్టణంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలుల దాదాపు రూ. లక్షా 73 వేలు ఉంటుందని తెలిపారు.

ఒక ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 9బ్యాగుల... ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ టాస్క్​ఫోర్స్ పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. లక్షా 73వేలు ఉంటుందని అన్నారు.

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవాడకు చెందిన ఎరుకల సదానందం... ఇంట్లో వీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని, గుట్కా ప్యాకెట్లను మట్టెవాడ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినోద్​కుమార్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.