ETV Bharat / state

బాల్యదశ నుంచే బాలికలకు రక్షణ కల్పించాలి

author img

By

Published : Aug 25, 2019, 11:51 PM IST

బాల్యదశ నుంచే బాలికకు రక్షణ కల్పిద్దాం

నేటి చిన్నారులే రేపటి పౌరులు. మంచి చెడుల మధ్య తారతమ్యాలను తెలిపి వారిని మంచి మార్గంలో పయనించేలా చేయడంలో గురువుల బాధ్యత కీలకం. అమ్మ పొత్తిళ్ల నుంచే అమ్మాయిలు ఎదుర్కొంటున్న అకృత్యాలకు చరమగీతం పాడాలంటే చిన్నారులకు అన్ని అంశాలపై అవగాహన అవసరం. ఇందుకు పాఠశాలే సరైన వేదికని భావించి విద్యార్థుల్లో అనుమానాలు, భయాలు తొలగించి మంచి మార్గం చూపేందుకు బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వరంగల్​ గ్రామీణ జిల్లా యంత్రాంగా యువ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. అవేంటో మనమూ చూద్దాం...

పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక అంశాలు, స్త్రీ, పురుషుల మధ్య తేడాలు, ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ లాంటి ఎన్నో ప్రశ్నలు చిన్నారుల మెదడుకి మొగ్గదశలోనే తెలియజేయాలి. మనిషితోలు కప్పుకున్న మృగాల దాడిలో ఎందరో చిన్నారుల బతుకులు నాశనం అవుతున్నాయి. తమపై జరుగుతున్న కొన్ని అకృత్యాలు చెప్పుకునేందుకు భయపడో, సిగ్గుపడో ఎవ్వరితోనూ పంచుకోరు. ఇలాంటి వాటికి పరిష్కారం కోసం సరైన వేదిక పాఠశాలే అని గుర్తించి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వరంగల్​ గ్రామీణ జిల్లా యంత్రాగం యువ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలలకు రక్షణ కల్పించి, భరోసా ఇచ్చేందుకు ఇంటా బయట తోటి వారితో ఎలా మెలగాలి అన్న విషయాలతో పాటు... బాలల హక్కులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.

బాల్యదశ నుంచే బాలికకు రక్షణ కల్పిద్దాం

రెండు బృందాలు.. వారానికి నాలుగు స్కూళ్లు

ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా 151 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రతి మంగళ, శుక్రవారం ఈ కార్యక్రమం చేపడతారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా కొన్ని సంక్షిప్త చిత్రాలను సిద్ధం చేశారు. మొత్తం రెండు బృందాలుగా వారానికి నాలుగు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇబ్బందులను చెప్పుకునేలా

ఈ బృందంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ముగ్గురు, విద్య వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక్కొక్కరూ కౌన్సిలర్లుగా ఉంటారు. అంతేకాకుండా అన్ని కేజీబీవీ పాఠశాలల్లో బాలికల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఓ పెట్టె ఉంచుతారు. శారీరకంగా గానీ, మానసికంగా గానీ బాలికలకు భయాలు లేకుండా ఎదుర్కునే సమస్యలు చెప్పుకునేందుకు ఇది చాలా ఉపకరిస్తోంది.

నేటి సమాజంలో పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మానవ సంబంధాలు, మంచికీ చెడుకీ తేడాలు.. మానవత్వపు విలువలపై అవగాహన అవసరం. బాల్య దశనుంచి వారి పెరిగిన వాతావరణం, నేర్చుకున్న అలవాట్లే రేపు వారు నిర్మించుకునే సమాజానికి మూలాధారాలు. చట్టాలెన్ని ఉన్నా.. గస్తీ ఎంత కాస్తున్నా నేటిరోజుల్లో అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నాం. విష వృక్షాన్ని తుంచాలంటే కొమ్మలు నరికితే సరిపోదు.. కూకటి వేళ్లతో సహా తీసేయాలి. లేదా మొక్క మొదటి దశలోనే గుర్తించి సంరక్షించుకోవాలి. ఈ విధంగానే పిల్లలకు బాల్యదశ నుంచే చట్టాలపైన, మానవతా విలువలపైనా అవగాహన కల్పిస్తే ఆరోగ్యవంతమైన రేపటి సమాజానికి పునాది అవుతోంది.

మొక్కుబడిగా మారకూడదు

ఏదో మొక్కుబడిగా కాకుండా విస్తృతంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మృగాళ్ల దాడికి బలైపోకుండా... కీచకుల గాలానికి పడకుండా ... కేటుగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు బాలికలకు ఉపకరిస్తోంది. అవగాహన కల్పిస్తూ పోతే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతోంది.

ఇదీ చూడండి: మహిళపై అత్యాచారం.. నలుగురు నిందితుల అరెస్టు

Intro:Body:

school


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.