ETV Bharat / state

Old woman story : అవ్వకు దేవుడే తోడు... గుడి మెట్లే ఆవాసం..!

author img

By

Published : Jan 29, 2022, 4:26 PM IST

Old woman story, problems double bed room house
అవ్వకు దేవుడే తోడు... గుడి మెట్లే ఆవాసం..!

ఆ వృద్ధురాలికి నిలువ నీడ లేదు. పింఛను డబ్బు మందులకే సరిపోవడం లేదు. భర్త చనిపోయాడు. కొడుకు వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆదుకోవాలని అధికారులకు మెురపెట్టుకోగా.... రెండు పడకల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీలు మాటలకే పరిమితమయ్యాయి. చేసేది లేక గుడిమెట్లనే ఆవాసంగా మార్చుకుని కాలం వెళ్లదీస్తోంది ఆ అవ్వ.

ఆమె పేరు లక్ష్మిబాయి. వయసు డెబ్భై ఏళ్ల పైనే. కట్టుకున్నవాడు కొన్నేళ్ల క్రితమే కాలం చేశాడు. ఒక్కగానొక్క కొడుకు.. వదిలేసి ఎటో వెళ్లి పోయాడు. నిలువ నీడలేక ఉన్న ఓ అవ్వ దీన స్థితి ఇది.

మాటల వరకే హామీలు..

సంగారెడ్డి పట్టణంలో ఒక చిన్న గదిలో లక్ష్మీబాయి అనే అవ్వ అద్దెకు ఉండేది. నెలనెలా వచ్చే పింఛను డబ్బులు మందుగోళీలకే సరిపోతుండటంతో.. అద్దె చెల్లించలేని పరిస్థితి వచ్చింది. యజమానులు గది ఖాళీ చేయించడంతో ఆమె రోడ్డున పడింది. అధికారులకు తన పరిస్థితిని విన్నవించగా.. ఆ అవ్వకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అవి కాస్తా మాటలకే పరిమితమయ్యాయి.

గూడు కోసం వేడుకుంటున్న అవ్వ

సంగారెడ్డి కలెక్టరేట్‌ చుట్టూ రెండు నెలలుగా లక్ష్మీబాయి ప్రదిక్షిణలు చేస్తున్నా... ఇప్పటికీ ఆమెకు ఇల్లు ఇవ్వలేదు. అనారోగ్య సమస్యలతో నడవలేని స్థితిలోనూ నిత్యం కార్యాలయానికి వెళ్తోంది. పడిగాపులు కాస్తూ అధికారులను వేడుకుంటోంది. చేసేది లేక సదాశివపేట సమీపంలోని ఓ ఆలయంలో ఉంటున్నట్లు తెలిపింది. గుడి మెట్ల మీద ఉంటూ కాలం వెళ్లదీస్తోంది ఆమె. చుట్టు పక్కల వాళ్లు ఇచ్చే సరుకులతో పొట్ట నింపుకుంటున్నానని పేర్కొంది. మెట్ల మీద బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నానని... అధికారులు ఇప్పటికైనా తన బాధను అర్థం చేసుకొని సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

అవ్వకు దేవుడే తోడు... గుడి మెట్లే ఆవాసం..!

'నాకు ఏడన్న నాలుగు రేకులు వేసి.. ఇంత గూడు కట్టమని అధికారులను వేడుకున్నా. నాకు ఇంత గూడు, నీళ్లు, ఓ లైట్ ఉంటే చాలు అని చెప్పిన. అందుకు అధికారులు సరే అమ్మ బాధపడకు అన్నారు. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తాం అన్నారు. రోజూ తిరుగుతున్న. కిరాయి కట్టడానికి చేతకాక అడవిలో గుట్టల్లో ఉన్నా. గుడి మెట్లమీదనే ఉంటున్నా. ఒకరు బియ్యం, ఒకరు చాప, దుప్పటి ఇలా కొందరు ఇచ్చారు. అట్లనే బతుకుతున్నా.

-లక్ష్మీబాయి, వృద్ధురాలు

ఇదీ చదవండి: మళ్లీ చలిపులి పంజా.. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.