ETV Bharat / state

సీసీ కెమెరాల ఏర్పాటులో మనమే ముందున్నాం: సబితా ఇంద్రారెడ్డి

author img

By

Published : Apr 17, 2021, 10:09 PM IST

minister sabitha indra reddy started cc cameras
సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సీసీ కెమెరాల ఏర్పాటులో మన రాష్ట్రమే ముందంజలో ఉందని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పోల్చుకుంటే అధికశాతం మనవద్దే ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ పీఎస్​ పరిధిలోని గుర్రంగూడలో సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​తో కలిసి ఆమె ప్రారంభించారు.

దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఎక్కువశాతం మన రాష్ట్రంలోనే ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ పీఎస్​ పరిధిలోని గుర్రంగూడలో 106 కమ్యూనిటీ సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​తో కలిసి ఆమె ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కార్పొరేటర్ గడం లాక్ష్మారెడ్డిని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు లక్షల 65 వేల కెమెరాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

కేసుల ఛేదనలో కీలకం: రాచకొండ సీపీ

సీసీ కెమెరాల ద్వారా ఎన్నో కేసులను 24 గంటల్లోనే ఛేదించగలిగామని సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు, అపార్ట్​మెంట్లలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాచకొండ పరిధిలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటన్నింటినీ బంజారా హిల్స్​లోని కమాండ్ కంట్రోల్​కు అనుసంధానిస్తామని సీపీ వివరించారు.

ఇదీ చూడండి: 'దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.