ETV Bharat / state

షాద్ నగర్​లో దారుణం - యువతిపై కత్తితో దాడి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 4:41 PM IST

Man Attacked Young Woman with Knife : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. మరో యువకుడితో చనువుగా ఉంటుందనే అసూయతో.. పక్కా ప్రణాళిక రచించి ఇంటికి వెళ్లి మరీ ఘాతుకానికి పాల్పడ్డాడు. అమ్మాయి మెడ, చేతులపై విచక్షణారహితంగా దాడి చేసి.. అక్కడ నుంచి పరారయ్యాడు.

Rangareddy Crime News Today
Man Attacked Young Woman with Knife

Man Attacked Young Woman with Knife : భాగ్యనగరంలో మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. ప్రేమోన్మాది దాడిలో ఎందరో యువతులు బలవుతున్న ఘటనలు పునరావృతమవుతునే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. చదువు పేరిట సన్నిహితంగా మెలిగి ప్రేమ ముసుగులో వేధించిన ఓ యువకుడు.. యువతిపై కత్తితో దాడికి తెగబడిన ఘాతుక చర్య.. జిల్లాలో సంచలనంగా మారింది.

తనతో క్లోజ్​గా మెలిగిన యువతి మరో యువకుడితో చనువుగా ఉంటుందని.. అసూయ పెంచుకున్న ఓ వ్యక్తి.. పక్కా ప్రణాళికతో ఇంటికి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. షాద్‌నగర్‌లోని ఓ కాలనీకి చెందిన యువతికి కాలేజీలో(College) చదివే సమయంలో.. ఫరూక్‌నగర్‌ మండలం పులిచెర్లకుంట గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.

Attack: కర్రతో యువతిపై దాడి.. స్నేహితుడి కోరిక తీర్చాలంటూ బెదిరింపు

కళాశాల పూర్తయిన తర్వాత ఇద్దరు కొంతకాలం ఒకే షాపులో పనిచేసినట్టు సమాచారం. ఆ తర్వాత యువకుడు షాపులో నుంచి వెళ్లిపోగా.. అమ్మాయి మాత్రం అదే షాపులో పనిచేస్తుంది. అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినా ప్రేమించాలని బలవంతం చేస్తూ అతడు వెంటపడేవాడు. ఈ మధ్యకాలంలో దుకాణంలో యువతి తరచూ వేరే యువకుడితో చనువుగా మాట్లాడుతుండటం చూసి అనుమానం పెంచుకున్నాడు. దీంతో పథకం ప్రకారం.. శనివారం(Saturday) కత్తితో యువతి ఇంటికి వెళ్లాడు.

ఆమె ఈమే అనుకుని: యువతి జుట్టు పట్టి లాగి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

Lover Attack on Young Woman : కాసేపు ఆమెతో గొడవపడి ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో మెడపై దాడికి తెగబడ్డాడు. యువతి తప్పించుకోవడంతో కుడిచేతి మణికట్టుకు బలంగా తాకి గాయమైంది. అంతలో బిగ్గరగా అరవటంతో.. విన్న ఆమె తల్లి పరుగున వచ్చి చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో.. అక్కడి నుంచి యువకుడు పరారయ్యాడు. హుటాహుటిన షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. యువతికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు(Investigate) చేపట్టి.. యువకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

షాద్ నగర్​లో దారుణం-యువతిపై కత్తితో దాడి-ఆపై పరారైన యువకుడు

సమాజంలో జరుగుతున్న ఇటువంటి ఘాతుకాలు వల్ల ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా యువతుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇటువంటి ఘటనే ఎల్బీ నగర్​లోనూ చోటుచేసుకుంది. ఆ ఘటనలో ప్రేమోన్మాది జరిపిన దాడికి యువతి గాయాలపాలవ్వగా.. తమ్ముడు మృతి చెందిన ఉదాంతం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కథనం కోసం పూర్తి సమాచారం కావాలంటే ఈ లింకుపై క్లిక్ చేయండి.

Young Man Attacked Woman : ప్రేమ పేరుతో యువతిపై దాడి.. చికిత్స పొందుతూ చనిపోయిన యువతి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.