ETV Bharat / state

రామోజీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లో అగ్నిమాపక కేంద్రం.. ప్రారంభించిన హోంమంత్రి

author img

By

Published : Aug 3, 2022, 3:41 PM IST

Updated : Aug 3, 2022, 6:36 PM IST

రామోజీ ఫౌండేషన్‌
రామోజీ ఫౌండేషన్‌

Ramoji Foundation: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో రామోజీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో అధునాతన హంగులతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Ramoji Foundation: రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. గతంలో అక్కడున్న అగ్నిమాపక కేంద్రం లోతట్టు ప్రదేశంలో ఉండటంతో కొద్దిపాటి వానలకు కూడా నీటమునిగేది. హయాత్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అండగా ఉన్న అగ్నిమాపక కేంద్రానికి కొత్తరూపు ఇచ్చేందుకు రామోజీ ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. కోటిన్నర రూపాయలతో ఫైర్ స్టేషన్‌ను పూర్తి హంగులతో తీర్చిదిద్దింది.

ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఉషాకిరణ్‌ మూవీస్‌ డైరెక్టర్‌ శివరామకృష్ణ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్‌ గుప్తా, ఎగ్గె మల్లేశం పాల్గొన్నారు. తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ కుమార్‌ జైన్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, కార్పొరేటర్‌ నవజీవన్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

"రామోజీ ఫౌండేషన్​కు ధన్యావాదములు తెలుపుతున్నాను. సామాజిక సేవలో భాగంగా అగ్నిమాపక కేంద్రం , పోలీస్​స్టేషన్​ను నిర్మించడం జరిగింది. అందులో భాగంగా రామోజీ ఫౌండేషన్​కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను." -మహమూద్‌ అలీ హోంమంత్రి

"రామోజీ ఫౌండేషన్​ తరుపున చాలా పనులు జరుగుతున్నాయి. సీఎస్ఆర్ రాక ముందుకు కూడా పాతిక సంవత్సరాల నుంచి రామోజీరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉన్నతమైన ఆలోచనలతో ఎంతో దయతో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. ఉభయరాష్ట్రాల్లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో 50వేలకు పైగా మొక్కలు నాటడం జరిగింది." - శైలజా కిరణ్ మార్గదర్శి ఎండీ

"సమాజ సేవలో చాలా మంది ఎన్నో రకాల సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి.. ఫిలింసిటీ వచ్చాక ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత పెరిగింది." - సుధీర్​రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే

రామోజీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లో అగ్నిమాపక కేంద్రం.. ప్రారంభించిన హోంమంత్రి

ఇవీ చదవండి: Etela on Revanthreddy: 'రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్'

ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్​మెంట్​.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా..

Last Updated :Aug 3, 2022, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.