ETV Bharat / state

సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 7:36 PM IST

Peddapalli Woman Starts Traditional Bakery Foods : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలంటే పట్టణాలకు వలస వెళ్లాలి. భారీగా పెట్టుబడులు పెట్టాలనే అపోహల నుంచి యువత బయటపడాలి. ఇలా చేస్తేనే ఏ ప్రాంతంలోనైనా వృద్ధి చెందినవారిమి అవుతాం. అందుకు మంచి ఉదాహరణగా పెద్దపల్లి జిల్లాకు చెందిన అఖిల అనే యువతినే తీసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఎదగాలనే పట్టుదల ఉంటే అవకాశాలు ఎన్నో ఉన్నాయని నిరూపించింది ఈ యువతి.

Peddapalli Woman
Peddapalli Woman Starts Traditional Bakery

సంప్రదాయపద్ధతిలో బేకరీ పదార్థాలు తయారు చేస్తున్న పెద్దపల్లి యువతి - ఆ తప్పు చేయవద్దంటూ హెచ్చరిక

Peddapalli Woman Starts Traditional Bakery Foods : మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే ఎంతో కృషి చేయాలన్న ఆలోచనకు భిన్నంగా అంకుర సంస్థ ఏర్పాటు చేయవచ్చని నిరూపించింది ఈ యువతి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉంటూ హైదరాబాద్‌లో ఎంఏ సోషియాలజీ పూర్తి చేసి సివిల్స్‌ శిక్షణకు దిల్లీ వెళ్లింది. రెండుసార్లు సివిల్స్‌ పరీక్షలు రాసినా అందులో విఫలం అయింది. అయినా ఏ మాత్రం కుంగిపోకుండా ఉండగా, అదే సమయంలో కరోనా వల్ల ఉద్యోగ సంక్షోభం ఏర్పడటంతో వ్యాపారంపై ఆసక్తి పెంచుకుంది.

అఖిల స్వస్థలం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి. ఆమె తల్లి మాధవి కౌన్సిలర్‌, తండ్రి రైతు. ఆ యువతి తన ఇంట్లోనే ఉంటూ స్వయంగా వంటకాలు తయారు చేయడం నేర్చుకున్నారు. తనను తాను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ కప్‌ కేక్‌, బ్రౌనీజ్‌, డోనాట్స్‌, మిల్లెంట్‌ బ్రౌన్స్‌, రాగి, గోధుమ కేకులతో పాటు ఓట్స్‌, మిల్లెట్‌ బ్రౌనీజ్‌ వంటివి తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు తన స్నేహితురాలితో కలిసి ఆన్‌లైన్‌లో విక్రయానికి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వ్యాపారాన్ని అఖిల మరింత వృద్ధి చేసుకున్నారు.

Woman Startup Business at Pedapalli : ఇప్పటికే పెద్దపల్లిలో అనేక బేకరీలు ఉండగా, ఆ బేకరీలకు భిన్నంగా రుచి, నాణ్యత ఉండాలన్న ఉద్దేశంతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త ఆహార పదార్థాలు తయారు చేయడానికి అఖిల శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో ప్రజలకు బలవర్ధక ఆహారం అందించాలన్న ఉద్దేశంతో పాటు హైదరాబాద్‌లో లభించే ఆహార ఉత్పత్తులకు దీటుగా ఆ యువతి వాటిని తయారు చేస్తుండటంతో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.

"నేను నా కెరియర్‌ను ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలని ప్రారంభించాను. కానీ రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ చేయడం ప్రారంభించాము. జస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ఒకటి క్రియేట్‌ చేసుకొని ఫుడ్‌ సరఫరా చేసేవాళ్లం. నేను ఉండే పెద్దపల్లి ప్రాంతంలో ఈ ఫుడ్‌ కామన్‌ కాదు. చాలా రేర్‌. ఎక్కడైనా దొరికినా అసలు బాగోడం లేదు. అప్పుడు నేను డిసైడ్‌ అయి క్వాలిటీ, క్వాంటిటీ, టేస్టును ఇచ్చి సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాలను తయారు చేయడం ప్రారంభించాను." - గాదె అఖిల, అంకుర సంస్థ యజమాని

South India Travel Photographer Aravind : సౌత్ ఇండియా అందాలను క్లిక్​మనిపిస్తున్న అరవింద్

వేరే బేకరీలకు భిన్నంగా ఆహార ఉత్పత్తులను తయారు చేయాలని అఖిల భావించారు. యంత్రాల ద్వారా కాకుండా స్వయంగా ఆర్టీజానల్‌ పద్ధతిలో ఈ ఉత్పత్తులను తయారు చేస్తూ ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు తీసుకొని ఇంట్లోనే తయారు చేసి హోమ్‌ డెలివరీ చేసేవారు. తర్వాత కొన్నాళ్లకు బ్యాంకు ద్వారా ముద్ర రుణం తీసుకొని ఫుడ్‌ ప్రాజెక్టు అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో ఆ యువతి వ్యాపారంలో దూసుకుపోతోంది.

వినియోగదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ : ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్న రోజుల్లో వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను అఖిల తీసుకొనే వారు. తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకొని ది ఫుడ్‌ ప్రాజెక్టు పేరుతో బేకరీ ప్రారంభించారు. గతంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇచ్చిన వారు సైతం ఇక్కడికి వచ్చి రుచులు ఆస్వాదిస్తున్నారు. దీంతో తమకు మరింత మనోధైర్యం పెరిగిందని నిర్వాహకురాలు చెబుతున్నారు. ఒకసారి ఈ యువతి చేసిన పదార్థాలు రుచి చూసిన వారు ఇక్కడి ప్రత్యేకతను స్నేహితులకు చెప్పక తప్పదంటున్నారని స్థానికులు తెలుపుతున్నారు.

ప్లాస్టిక్​, పాత ఫర్నీచర్​తోనే అందమైన ఇల్లు కట్టిన యువకుడు - ఎలాగో మీరూ చూసి తెలుసుకోండి

పైలట్‌ కల నెరవేర్చుకోబోతున్న పేదింటి అమ్మాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.