ETV Bharat / state

Bhatti Chitchat: 'అధికారంలో ఉన్న కేసీఆర్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు'

author img

By

Published : Apr 20, 2023, 5:42 PM IST

Bhatti Vikramarka ChitChat With Students
Bhatti Vikramarka ChitChat With Students

Bhatti Vikramarka ChitChat With Students: తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్​ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భట్టి కొంతసేపు విద్యార్థులతో కలిసి చిట్​చాట్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారినే అడిగి తెలుసుకున్నారు. ఈ దుస్థితిలో మార్పు రావాలంటే నేటి విద్యార్థులే చైతన్య వంతులుగా కావాలన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

Bhatti Vikramarka ChitChat With Students: తెలంగాణ వాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ.. ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొంతసేపు విద్యార్థులతో చిట్​చాట్​లో పాల్గొన్నారు.

ముందుగా ప్రభుత్వ పాఠశాలలో.. మిగతా కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారినే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమకు అనేక సంవత్సరాలుగా ఉపకారణ వేతనాలు అందడం లేదంటూ.. భట్టి దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఇంటర్ తర్వాత డిగ్రీ .. ఆ తర్వాత పీజీ లాంటి ఉన్నత చదువులకు నిరుపేద విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాజాగా పేపర్ లీకేజీల వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారి గురించి సైతం వివరించారు. విద్యార్థుల వాదనలు విన్న భట్టి విక్రమార్క వారికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉన్నత చదువులకు చేయూతను ఇచ్చేందుకు ఉపకరణ వేతనాలు అనే పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు.

కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. బర్రెలు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ అంటూ విద్యార్థులు, తెలంగాణ ప్రజానీకాన్ని కూలీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నినట్లు మండిపడ్డారు. ఈ దుస్థితిలో మార్పు రావాలంటే నేటి విద్యార్థులే చైతన్యవంతులుగా కావాలని.. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని భట్టి కోరారు.

చాలా మంది అనుకుంటూ ఉండోచ్చు. పేద వారికి ప్రభుత్వాలు ఫీజ్​ రీయంబర్స్​మెంట్ పేరుమీద ఉచితంగా డబ్బులు ఇస్తున్నాయని కాదు.. ఈ దేశ సమాజాన్ని బాగుచేసుకోవడం కోసం ప్రభుత్వాలు పెడుతున్నవి.. పెట్టుబడులు గానే చూడాలి తప్పా, లేదా పేదవారికి ఉచితంగా ఇస్తున్నారని ఎవరైనా భావిస్తే.. అది పొరపాటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. -భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీఎల్పీ నేత

'అధికారంలో ఉన్న కేసీఆర్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.