ETV Bharat / state

మూసీ ప్రాజెక్ట్​కు భారీ వరద.. ఎనిమిది గేట్లు ఎత్తిన అధికారులు

author img

By

Published : Jul 27, 2022, 8:40 PM IST

మూసీ ప్రాజెక్ట్​కు భారీ వరద
మూసీ ప్రాజెక్ట్​కు భారీ వరద

Musi Project gates open: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కొన్ని రోజులుగా వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 8 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

Musi Project gates open: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ రిజర్వాయర్​కు వరద నీటి తాకిడి పెరిగింది. ప్రాజెక్టుకు ఎగువన హైదరాబాద్​తో పాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 6348 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లను ఎత్తి 9956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయం దిగువన ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలను, మూసీ ఆయకట్టు రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 637 అడుగులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 2.57 టీఎంసీల నీరు ఉందని తెలిపారు.

మూసీ ప్రాజెక్ట్​కు భారీ వరద.. ఎనిమిది గేట్లు ఎత్తిన అధికారులు

ఎగువన కురిసిన వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు,సూర్యాపేట జిల్లా నాగారం, జాజిరెడ్డిగూడెం మండలం మీదుగా మూసీ ప్రాజెక్టుకు చేరుతోంది. మంగళవారం సాయంత్రం పొడిచేడు వద్ద సుమారు 6 ఫీట్ల ఎత్తుతో నీరు ప్రవహిస్తోంది. రేపు ఉదయానికి వరద పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి: హైదారాబాద్‌ను ముంచేసిన మూసీ.. భయం గుప్పిట్లో ప్రజలు

'ఆమె' సంకల్పానికి సలాం.. అవమానాలు భరించి.. వైకల్యాన్ని ఓడించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.