ETV Bharat / state

9వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ

author img

By

Published : Mar 16, 2020, 11:45 PM IST

exice and prohibition ci and junior asistant in acb trap
9వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ

సీజ్​ చేసిన వాహనాన్ని విడిపించేందుకు లంచం డిమాండ్ చేసి ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నిందితులను అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులు హాజరుపర్చనున్నట్టు అధికారులు తెలిపారు.

నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేట ఎక్సైజ్​ సీఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 9 వేలు లంచం తీసుకుంటుండగా సీఐ, జూనియర్ అసిస్టెంట్​ను అరెస్టు చేశారు. పదరం మండలం మారడుగుకు చెందిన దేశావత్ వెంకట్​ రాం నాయక్​ గతేడాది నవంబరులో అక్రమంగా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ అధికారులకు దొరికాడు. కేసు నమోదు చేసి కారు సీజ్​ చేశారు.

వాహనాన్ని విడిపించేందుకు లక్షా 50 వేలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసుకొని ఒరిజనల్ ఆర్సీ తీసుకొని 'ఇంటరిమ్ రిలీజ్ ఆర్డర్(మధ్యంతర ఉత్తర్వు)' ఇచ్చారు. వాహనాన్ని రిలీజ్ చేసేందుకు మరో లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించగా... సీఐ శ్రావణ్ కుమార్​ను వెంకట్ రాం నాయక్ కలిసి అంత డబ్బు లేదని చెప్పాడు. దీంతో ఆఫీస్​కు ప్రింటర్​ ఇప్పించాలని సూచించగా... 9 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.

వెంకట్​ రాం నాయక్​ ఏసీబీని ఆశ్రయించాడు. సీఐ ఆదేశాల మేరకు ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​ దేవేందర్​కు లంచం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న అనిశా అధికారులు వల పన్ని సీఐ, జూనియర్ అసిస్టెంట్​ను అరెస్టు చేశారు. నిందితులను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు అనిశా అధికారులు తెలిపారు.

9వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ

ఇదీ చూడండి: రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.