ETV Bharat / state

Super spreaders: వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​ శర్మన్​

author img

By

Published : May 30, 2021, 11:56 AM IST

collector supervised the vaccination centre in achampet
అచ్చంపేటలో టీకా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్​ తీసుకోవడానికి అర్హులు ఆసక్తి చూపుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ టీకా తీసుకోవాలని కలెక్టర్ శర్మన్​​ సూచించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ శర్మన్, జడ్పీ ఛైర్​పర్సన్ పద్మావతి పరిశీలించారు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన 3,400 మందికి టీకాలు ఇస్తున్నామని కలెక్టర్​ అన్నారు.

మొత్తం ఐదు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోందని ఈ రోజు వరకే సూపర్​ స్ప్రెడర్లకు అవకాశం ఉందని చెప్పారు. వ్యాక్సిన్​ కేంద్రంలో భౌతిక దూరం పాటించాలని అన్నారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని జడ్పీ ఛైర్​పర్సన్ సూచించారు.

ఇదీ చదవండి: Kishan Reddy: 'వ్యాక్సిన్​ వినియోగంలో ప్రపంచంలోనే మూడోస్థానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.