ETV Bharat / state

student commits suicide at Medchal : డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య... సూసైడ్​ నోట్​లో ఏం ఉందంటే?

author img

By

Published : Jun 7, 2023, 10:54 PM IST

student commits suicide
student commits suicide

student commits suicide due to financial problems : 'నా చావుకు ఎవరూ కారణం కాదు.. అందరూ మంచివాళ్లే.. అమ్మ, అక్కను బాగా చూసుకోండి' అంటూ సూసైట్ నోట్​ రాసి ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Student suicide at Pocharam IT corridor Medchal : రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ప్రేమ విఫలమైందని ఒకరు.. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు. వివాహేతర సంబంధం బయట పడిందని ఒకరు... ప్రేమించిన వ్యక్తి మోసం చేశారని ఇంకొకరు ఇలా అనునిత్యం ఏదో ఒక కారణంతో ఆత్మహత్యల వార్తలు వింటున్నాం. తాజాగా డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్​ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మేడ్చల్​ జిల్లా పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్ప కాలనీలో మల్లా జషువా(19) తల్లి, అతని సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి సమీపంలోని ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. మృతుడి అక్క ఇంటి వద్దనే ఉండి తల్లికి సహాయం చేస్తుంది. జాషువా మేడిపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో‌ డిగ్రీ మొదటి సంవత్సరం చదుతున్నాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో అల్వాల్​లోని ఓ బేకరిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జాషువా గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Degree student commits suicide at Medchal : కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో బుధవారం ఇంట్లో ఎవరూ లేని‌ సమయంలో ఫ్యాన్​కు‌ చున్నీ సహయంతో ఉరి వేసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికి తల్లి, అక్క వచ్చి చూడగా.. విగత జీవిగా వేలాడుతున్న జాషువాను చూసి తల్లడిల్లిపోయారు. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతుడు రాసినట్లుగా భావిస్తున్న ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోచారం ఐటీ కారిడార్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

సూసైడ్​ నోట్​లో ఏం ఉందంటే: ఆ లేఖలో 'నా చావుకు ఎవరూ కారణం కాదు.. అందరూ మంచివాళ్లే.. అమ్మ, అక్కను బాగా చూసుకోండి' అంటూ ఉంది. దీనిని బట్టి జాషువా ఆర్థిక ఇబ్బందులతోనే మృతి చెంది ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ లేఖ నిజంగా అతనే రాశారా లేదా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.