ETV Bharat / state

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట భాజపా నిరసన

author img

By

Published : Mar 20, 2021, 2:23 PM IST

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట భాజపా నిరసన
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట భాజపా నిరసన

మంచిర్యాల పట్టణంలో భాజపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉపయోగించడం లేదని ఆరోపించారు. కార్యాలయం ప్రారంభించి.. స్థానికులకు ఎమ్మెల్యే దివాకర్​రావు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.

మంచిర్యాల పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని దివాకర్​రావు ఎందుకు ఉపయోగించడం లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు ప్రశ్నించారు. భవనం ప్రారంభించి ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.

క్యాంపు కార్యాలయ ముందు పార్టీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో నిర్మించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కారణమేంటో ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలని బ​స్టాండ్, రైల్వేస్టేషన్​కు దగ్గర కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మించిందన్నారు. ఎమ్మెల్యే ఇక్కడ ఉండకపోవడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. భవనం అవసరం లేకుంటే మరో శాఖకు ఇవ్వాలని సూచించారు.

ఇదీ చూడండి: కొత్తగా 3,59,000 రేషన్​ కార్డులు ఇచ్చాం: గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.