ETV Bharat / state

బ్యాంక్​లో చోరీయత్నం సైరన్​ మోతతో దొంగ పరార్​

author img

By

Published : Mar 27, 2019, 12:57 PM IST

Updated : Mar 27, 2019, 3:08 PM IST

బ్యాంక్​లో చోరీయత్నం..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆంధ్రాబ్యాంక్​లో చోరీకి విఫలయత్నం జరిగింది. సైరన్​ మోగడం వల్ల దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.

బ్యాంక్​లో చోరీయత్నం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆంధ్రాబ్యాంక్​లో చోరీకి విఫలయత్నం జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముసుగు ధరించిన దుండగుడు బ్యాంక్​ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి దొంగతనానికి యత్నించాడు. గడ్డపారతో లాకర్​ తెరిచేందుకు విఫలయత్నం చేశాడు. ఏటీఎం గది వెనుకవైపు నుంచి తలుపును తెరిచేందుకు ప్రయత్నించడం వల్ల సైరన్​ మోగింది. భయాందోళనకు గురైన దొంగ అక్కడ నుంచి పారిపోయాడు.

సెన్సార్​ ద్వారా చోరీ యత్న సమాచారం ఆంధ్రా బ్యాంక్​ ముంబై కార్యాలయానికి చేరింది. అక్కడున్న అధికారులు బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకునే లోపే దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.

బెల్లంపల్లి ఏసీపీ బాలుయాదవ్​ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

సీసీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు నమోదయ్యాయని.. త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు.

ఇవీ చూడండి:లోక్​సభ ఎన్నికల వేళ 15 కోట్లకు పైగా సొత్తు జప్తు

Intro:tg_adb_81_27_andra_bannklo_choriki_yatnam_avb_c7
బ్యాంక్ లో చోరీకి విఫలయత్నం
ఆంధ్రబ్యాంకులో చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు. ముఖానికి ముసుగు ధరించి మరీ తాళాలు పగులగొట్టి బ్యాంక్ లోనికి ప్రవేశించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో కలకలం సృష్టించింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆంధ్రబ్యాంక్ లో ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముసుగు ధరించిన దొంగ బ్యాంక్ ప్రదానద్వారం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. గడ్డపారతో లాకర్ తాళాలు పగులగొట్టడానికి ప్రయతించాడు. తాళాలు రాకపోవడంతో ఏటీఎం గది వెనుకవైపు తలుపును గడ్డపారతో తవ్వడానికి ప్రయత్నించాడు. సైరన్ మోగడంతో దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. సైరన్ శబ్దం కావడంతో సెన్సార్ ద్వారా సమాచారం ప్రధాన బ్యాంక్ ముంబైకి వెళ్ళింది. అధికారులు వెంటనే సమాచారాన్ని బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో పట్టణ ఎస్ హెచ్ ఓ రాములు బ్యాంకుకు చేరుకునే లోపే దొంగ పారిపోయాడు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ బ్యాంక్ కు చేరుకుని విచారణ జరిపారు. సీసీ కెమెరాల్లో దొంగ ముఖానికి ముసుగు ధరించి ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. త్వరలోనే కేసును చేదిస్తామని పేర్కొన్నారు.
రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేష్
9949620369


Body:బైట్
బాలు జాదవ్, ఏసీపీ, బెల్లంపల్లి


Conclusion:బ్యాంక్ చోరీకి యత్నం
Last Updated :Mar 27, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.