ETV Bharat / state

Mahabubabad District SP Transfer : మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ ఆకస్మిక బదిలీ.. ఆ ఎమ్మెల్యేనే కారణమా..?

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 11:39 AM IST

Mahabubabad District SP Saratchandra Pawar Transferred
TS Govt

Mahabubabad District SP Transfer : మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శరత్‌చంద్ర పవార్‌ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీచేస్తూ.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ శరత్‌చంద్ర ఖానాపూర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అల్లుడు. కాగా.. కాంగ్రెస్​లోకి వెళ్లేందుకు ఆమె రంగం సిద్ధంచేసుకున్న క్రమంలో శరత్​చంద్ర బదిలీ ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో చర్చనీయాంశమైంది.

Mahabubabad District SP Transfer : మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శరత్‌చంద్ర పవార్‌ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీచేస్తూ.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 డిసెంబరు 26వ తేదీన శరత్‌చంద్ర పవార్‌ మహబూబాబాద్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.

MLA Rekha Naik Son in Law Transfer : డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను శరత్​చంద్ర స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అల్లుడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(CM KCR) ఇటీవల ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రేఖా నాయక్‌ పేరు లేకపోగా.. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆమె రంగం సిద్ధంచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరత్‌చంద్ర పవార్ బదిలీ విషయం చర్చనీయాంశమైంది.

BRS MLA Rekhanayak Join Congress Today : నేడు కాంగ్రెస్‌ గూటికి ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్

SP Sharat Chandra Pawar Transfer : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. శాసనసభ అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురైన ప్రస్తుత ఖానాపూర్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేయడంతో ఈ విషయం కాస్త రాజకీయంగా కాకరేపింది. అలాగే ఆసిఫాబాద్ టికెట్‌ కోసం రేఖా నాయక్ భర్త శ్యామ్ ​నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో రేఖా నాయక్ భర్త శ్యామ్ ​నాయక్ కాంగ్రెస్‌లో చేరిన విషయం చేరారు.

MLA Rekha Naik Applies For Congress Ticket : నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే రేఖా నాయక్(MLA Rekha Naik) కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరు మోసం చేసినా.. నియోజకవర్గం ప్రజలంతా తన వెంటనే ఉన్నారన్న ఆమె.. పార్టీ మారకముందే.. కాంగ్రెస్​లో ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది. ఈ నేపథ్యంలో శరత్‌చంద్ర పవార్ బదిలీ విషయం టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది.

Telangana BRS MLA Candidates List 2023 : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా బీఆర్ఎస్ సిట్టింగ్​లు అందరికీ టికెట్లు లభించగా.. అవకాశం దక్కని వారిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్‌ బీఆర్ఎస్​ను వీడేందుకు సిద్ధమయ్యారు. రేఖా నాయక్ స్థానంలో జాన్సన్ రాఠోడ్ నాయక్​కు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది.

MLA Rekha Naik Congress Ticket : కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న MLA రేఖా నాయక్

BRS MLA Ticket Issue In Adilabad District : కారులో కుదుపులు.. ఇంతకీ వారి పయనం ఎటువైపో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.