ETV Bharat / state

Online Fraud In Karimnagar : తక్కువ ధరకే ఎలక్ట్రానిక్​ వస్తువులు, బంగారం అంటూ.. రూ.9 కోట్లు స్వాహా

author img

By

Published : Jul 30, 2023, 4:15 PM IST

Updated : Jul 30, 2023, 4:44 PM IST

onlineshopping
onlineshopping

Selling Goods Low Price 9 Crore Cheat : ఆన్​లైన్​లో తక్కువ ధరకే వస్తువులు వస్తున్నాయని.. ముందే డబ్బులు చెల్లించి చాలా మంది కొనేస్తారు. తీరా ఆ వస్తువులు రాకపోయేసరికి మోసపోయామని గ్రహిస్తారు. ఇలా కొన్ని కోట్ల రూపాయలు సైబర్​ నేరగాళ్లు దోచుకుపోతున్నారు. తాజాగా కరీంనగర్​లో కూడా ఇలాంటి సంఘటననే జరిగింది. ఏకంగా రూ.9 కోట్లను స్వాహా చేశాడు.

9 Crore Cyber Fraud In Karimnagar : తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్​ వస్తువులు, బంగారం ఇప్పిస్తానని చెప్పి.. ఆన్​లైన్​ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. పలువురి వద్ద నుంచి రూ.9 కోట్ల మేరకు డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. మోసాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిరిసిల్ల ఎస్పీ అఖిల్​ మహాజన్​ వివరించారు.

Online Fraud
Online Fraud

ఎస్పీ అఖిల్ మహాజన్​ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కట్టుకోజుల రమేశ్​ అలియాస్ రమేశ్​ చారి అనే వ్యక్తి.. ప్రైవేట్​ టీచర్​గా ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం మానేసి.. ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఉద్యోగం చేయడం వల్ల తక్కువ డబ్బులు రావడంతో సరిపోక.. ఎలాగైన సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్​లైన్​లో వస్తువులు తక్కువ రేటుకు కొనేవాడు. ఆ తర్వాత వాటిని తన ఫేస్​బుక్​, సోషల్​ మీడియా వేదికల్లో అతితక్కువ ధరకే ఇస్తానని చెప్పి పోస్టులు పెట్టేవాడు. అది చూసి చాలామంది అతనికి ఫోన్​ చేసి.. వస్తువులు కొనేవారు. అలా రమేశ్​ చారికి డెలివరీ ఖర్చుల డబ్బులు వచ్చేవని తెలిపారు.

Online Fraud Through Facebook : ఇలా అధిక మొత్తంలో డబ్బులు రావడం చూసి.. ఎలాగైనా తానే ఒక మార్కెటింగ్ వెబ్​సైట్​ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా మొదటగా మోసాలు మొదలు పెట్టడం ప్రారంభించాడు. ఫేస్​బుక్​లో rameshchary అనే ఐడీని ఏర్పాటు చేసుకొని.. తన నంబర్లను లింక్​ చేశాడు. అలా ఆన్​లైన్​ ఆఫర్​ ద్వారా వచ్చిన వస్తువులు కొనుగోలు చేసి.. తక్కువ ధరకు మార్కెటింగ్ యాడ్​ ఇచ్చేవాడు. ఇలా చాలా మందిని నమ్మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. మొదటగా ప్రోడక్టు ఆర్డర్​ చేస్తే.. వారు డబ్బులను తన ఖాతాలో జమ చేస్తేనే వస్తువులు డెలివరీ ఇచ్చేవాడు.

Online Fraud By Goods Are Cheap : ఇలా 14 నెలలు నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. కొద్ది మందికి మాత్రమే డెలివరీ చేశాడని ఎస్పీ అఖిల్​ మహాజన్​ చెప్పారు. ఆర్డర్​ లేట్ అవుతుందని కస్టమర్లు అడిగితే.. కొంచెం సమయం వేచి ఉండాలని నమ్మించసాగేవాడు. ఇంకా తాను గోల్డ్​ స్మిత్​నని నమ్మించి.. తక్కువ ధరకే తనవద్ద బంగారం వస్తుందని చెప్పి.. మోసం చేసేవాడు. ఇలా అందరి నుంచి రూ.9 కోట్లను స్వాహా చేశాడు. ఈ మోసాలన్నీ హైదరాబాద్​ కేంద్రంగా సాగేవని తెలిపారు. ఆ డబ్బులన్నీ అయిపోయాక.. ముస్తాబాద్​ ప్రాంతానికి చెందిన కస్టమర్​ను నమ్మించేందుకు ప్రయత్నించాడు. అతనికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

19 కేసుల్లో నిందితుడు : పోలీసులు స్పెషల్​ టీమ్​ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా.. రమేశ్​ చారి మోసా​లు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో అంతకు ముందు 19 కేసులు నమోదయ్యాయని దర్యాప్తులో తేలింది. గతంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. మోసం చేసిన కేసులో నిందితునిపై పీడీ యాక్ట్​ నమోదు చేశారు. ఇప్పుడు అతనిని రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే వస్తువులు వస్తాయన్న ప్రకటనలు చూసి ఇలా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలుపుతున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Jul 30, 2023, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.