ETV Bharat / state

MLC Nominations in karimnagar: కరీంనగర్​ ఎమ్మెల్సీ బరిలో 10 మంది అభ్యర్థులు

author img

By

Published : Nov 26, 2021, 6:10 PM IST

కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది (MLC Nominations in karimnagar). చివరి రోజు ఏకంగా 14 మందితో అధికార పార్టీ నాయకులు నామపత్రాలను ఉపసంహరింప చేయగా బరిలో 10మంది మిగిలారు. వీరిలో తెరాసకు రాజీనామా చేసిన రవీందర్ సింగ్‌ కూడా ఉన్నారు.

Mlc  Nominations
Mlc Nominations

MLC Nominations in karimnagar: కరీంనగర్​ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 24 మంది నామినేషన్లు వేశారు. మిగతా జిల్లాల్లో అధికశాతం స్థానాలు ఏకగ్రీవం చేయడంలో సఫలమైన అధికార పార్టీ నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం విజయం సాధించలేక పోయారు. మధ్యాహ్నం 3గంటల వరకే నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాలను కొనసాగించారు. అందులో భాగంగా ఏకంగా 14 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్స్‌ను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్స్ విత్ డ్రా చేసుకున్న వారిలో.. పురం రాజేశం, గంగాధర శంకరయ్య, అన్నారం శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, మేకల గణేష్, మొహమ్మద్ చాంద్ పాషా, పొలాస తిరుపతి, నలుమచు రామకృష్ణ, బండం వసంత రెడ్డి, ముద్దం తిరుపతి, బొమ్మెర వేణి తిరుపతి, చీకట్ల రాజశేఖర్, మాదాసు వేణు, శీలారం సత్తయ్యలు ఉన్నారు.

ఫలితాలు ఏమైనా కావొచ్చు..!

(local body mlc election) రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకుంటున్న తెరాసకు.. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకగ్రీవం ఏమో కానీ ఫలితాలు తారుమారు కావొచ్చనే ఆందోళన ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. అధికార పార్టీ నుంచి ఎల్.రమణ, టి.భానుప్రసాద్‌లు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచారు.

'అక్కడ ఓ స్థానంలో తెరాస ఓటమి ఖాయం'

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు ఏకగ్రీవం అవకాశం ఇవ్వొద్దని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela chit chat with media) విజ్ఞప్తి చేశారు. కరీంనగర్​లో ఒక స్థానంలో తెరాస ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు మీడియాతో నిర్వహించిన చిట్​చాట్​లో ఈటల, విజయశాంతి.. సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదిలాబాద్ నుంచి తానే ఒకరిని పోటీకి దింపినట్లు ఈటల తెలిపారు. ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి.. గెలుస్తామా, ఓడుతామా అనేది పక్కన పెడితే పోటీ చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే కేసీఆర్​కు కనీసం భయమైనా ఉండేదని అభిప్రాయపడ్డారు.

డిసెంబర్​ 10న పోలింగ్​

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc Elections) నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 12 స్థానాలకు నోటిఫికేషన్ రాగా.. ఆరు ఏకగ్రీవమై తెరాస ఖాతాలో పడ్డాయి. మిగతా 6 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్‌(polling) జరగనుంది. డిసెంబర్‌ 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చూడండి: Adilabad Mlc Election: తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ.. ఉద్రిక్తంగా నామినేషన్ల ఉపసంహరణ

Etela on mlc elections: 'కరీంనగర్​లో తెరాస ఓ స్థానం ఓడిపోవడం ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.