ETV Bharat / state

దోమకొండ కోటకు యునెస్కో పురస్కారం

author img

By

Published : Nov 27, 2022, 9:58 AM IST

Domakonda Fort
Domakonda Fort

UNESCO Award for Domakonda Fort : రాష్ట్రంలో పురాతన కట్టడమైన దోమకొండ కోటకు అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఆసియా-పసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌, అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌ 2022కు ఈ కోట ఎంపికైనట్లు దోమకొండ ట్రస్ట్‌ సభ్యులు వెల్లడించారు.

UNESCO Award for Domakonda Fort : కామారెడ్డి జిల్లా దోమకొండ కోట యునెస్కో ఆసియా-పసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌, అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌ 2022కు ఎంపికైంది. వివిధ దేశాల నుంచి మొత్తం 287 ప్రతిపాదనలు రాగా అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్టులను యునెస్కో ఎంపిక చేసింది. ప్రైవేటు నిర్మాణమైనప్పటికీ సాంస్కృతిక స్థలాన్ని విజయవంతంగా పునరుద్ధరించిన నేపథ్యంలో ఎంపిక చేసినట్లు దోమకొండ ట్రస్ట్‌ సభ్యులు వెల్లడించారు.

నిరాదరణకు గురైన కోటకు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో 2011లో పనులు ప్రారంభించారు. ప్రముఖ కన్జర్వేటివ్‌ అర్కిటెక్ట్‌ అనురాధానాయక్‌ను చీఫ్‌ కన్సల్టెంట్‌గా నియమించారు. సుమారు 11 ఏళ్ల పాటు పనులు కొనసాగించారు. కోటకు యునెస్కో అవార్డు లభించడం పట్ల దోమకొండ సంస్థాన్‌ కుటుంబ వారసుల్లో ఒకరైన కామినేని అనిల్‌, ఆయన సతీమణి శోభన హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.