ETV Bharat / state

కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

author img

By

Published : Oct 29, 2020, 9:22 AM IST

Updated : Oct 29, 2020, 10:02 AM IST

CM KCR will inaugurate the RAITHU VEDHIKA Janagama district
కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

09:20 October 29

కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

జనగామ జిల్లా కొడకండ్లలో ఈనెల 31న మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు వేదికను ప్రారంభించనున్నారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్న సీఎం.. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రభుత్వం.. రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశం, ఆవశ్యకత, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను కేసీఆర్‌ వివరిస్తారు.  

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు సమితి.. జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

ఇవీచూడండి: ఒక్కసారైనా సొనాల 'రైతు వేదిక' చూడాల్సిందే..!

Last Updated :Oct 29, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.