ETV Bharat / state

స్వీపింగ్‌ యంత్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Jun 7, 2021, 12:01 PM IST

sweeping machine, mla sanjay kumar
ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్వీపింగ్ యంత్రం ప్రారంభం

జగిత్యాల జిల్లాలో స్వీపింగ్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ ఛైర్​పర్సన్​తో కలిసి ప్రారంభించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వీపింగ్‌ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్​పర్సన్‌ బోగ శ్రావణితో కలిసి ప్రారంభించారు. పట్టణంలోనే తొలిసారిగా ఈ యంత్రం ద్వారా రహదారులను పరిశుభ్రంగా ఉంచనున్నారు.

రహదారుల పరిశుభ్రత కోసం ఈ ఆధునిక యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే అన్నారు. పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నందున అన్ని ప్రాంతాల్లోని రోడ్లను శుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్‌శాఖ పని చేస్తోందన్నారు.

ఇదీ చదవండి: Petrol price: రికార్డు స్థాయికి చమురు​ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.