ETV Bharat / state

మెట్‌పల్లి ఖాదీ.. నాటి నుంచి నేటి వరకు అదే స్పెషాలిటీ!

author img

By

Published : Aug 15, 2021, 7:57 AM IST

metpally khadi story
మెట్‌పల్లి ఖాదీ, మెట్‌పల్లి ఖాదీ ప్రత్యేకత

నాడు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసి.. నేడు ఎంతోమందికి ఉపాధి చూపుతోంది మెట్‌పల్లి ఖాదీ. మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుస్తూ అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. మెట్‌పల్లి ఖాదీ ప్రత్యేకతపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...

మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకందు మెట్‌పల్లి ఖాదీ. జగిత్యాల జిల్లా మెట్‌ల్లిలో జాతీయ రహదారి పక్కనే పాత బస్టాండ్ వద్ద సుమారు 14 వేల ఎకరాల విశాలమైన ప్రదేశంలో మెట్‌పల్లి ఖాదీని ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ ప్రధాన శిష్యుడు అన్నాసాహెబ్ సహస్ర బుద్ధి 1929లో మహారాష్ట్ర నుంచి కాలినడకన అక్కడకు వచ్చి ఈ ఖాదీని స్థాపించారు. 1934 వరకు మహారాష్ట్ర బ్రాంచ్ కింద పని చేస్తూ వచ్చింది. 1951 నుంచి రామానందతీర్థ ఆధ్వర్యంలో మెట్‌పల్లి పేరుతో కొనసాగింది. 1967నుంచి మెట్‌పల్లి ఖాదీ పేరుతో తన మార్క్ చాటుకుంటోంది.

ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసి జాతీయ జెండాను రెపరెపలాడించింది. ఈనాడు వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తూ ఎంతోమందికి ఉపాధి చూపుతోంది. ప్రస్తుతం ఖాదీ బోర్డు చైర్మన్‌గా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొనసాగుతున్నారు. మెట్‌పల్లి ఖాదీలో తయారైన వస్త్రాలను ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు అండగా నిలుస్తున్నారాయన.

1967లో ఈ మెట్‌పల్లి ఖాదీ ఏర్పాటైంది. విదేశీ బట్టలు బహిష్కరించి, స్వదేశీ దుస్తులను ధరించాలనే మహత్ముని పిలుపుమేరకు దీనిని ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఖాదీ ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా ప్రభుత్వం ద్వారా ఖాదీ వస్త్రాలను విక్రయిస్తున్నాం.

-విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే, ఖాదీ బోర్డు ఛైర్మన్


రజాకార్లను తరిమికొట్టేందుకు స్వాతంత్ర సమరయోధులు ఎంతో కృషి చేశారు. ఆనాటి సమరయోధులే నేడు ఖాదీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.

స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఉద్యమం రజాకార్ల ఉద్యమం. ఇవాళ వేల మంది ఉపాధికి ఈ ఖాదీ ఉపయోగపడుతోంది. నాటి స్వాతంత్య్ర సమరయోధులే నేడు కార్యకర్తలుగా పని చేస్తున్నారు. దేశభక్తి కోసం ఖాదీ ఉద్యమం స్ఫూర్తిగా ఇంకా మేం పని చేస్తున్నాం.

-వెంకటేశ్వర రాజు, ఖాదీ సీనియర్ కార్యకర్త


ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన మెట్‌పల్లి ఖాదీ.. అదే ఉద్యమ స్ఫూర్తితో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ విదేశీ వస్త్రాలు వద్దు స్వదేశీ వస్త్రాలే ముద్దు అనే నినాదంతో ముందుకు సాగుతోంది. తమ వేతనాలు తక్కువున్నా.. మహాత్ముడికి నచ్చిన ఖాదీలో పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందంటున్నారు కార్మికులు.

మహాత్మగాంధీ దారిలో నడపాలన్న ఉద్దేశంతో జీతాలు తక్కువ ఉన్నా ఈ ఖాదీలో పని చేస్తున్నాం. విదేశీ వస్త్రాలు వాడకుండా... మనమే తయారు చేసుకొని వాడాలని తయారు చేస్తున్నాం. మేం సంతృప్తిగా పని చేస్తున్నాం.

-పద్మ, ఖాదీ కార్యకర్త


కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డును 2007లో మెట్పల్లి ఖాధీ సొంతం చేసుకుంది. ప్రతి ఏటా రెండు కోట్ల వరకు వస్త్రాలను తయారు చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు.


గతంలో ఖాదీ అంటే కేవలం నాయకులు వాడుతారు అనుకునేవారు. కానీ ఆ అపోహలను తొలగించడానికి మార్కెట్‌లో ఉన్న ట్రెండ్‌ను తీసుకొచ్చాం. ఖాదీలో కొత్త డిజైన్లు రూపొందిస్తున్నాం. యువతను ఆకర్షించేలా రెడీమేడ్ తయారుచేస్తున్నాం. సంస్థ టర్నోవర్ రూ.మూడు కోట్ల వరకు ఉంటుంది.

-మాధవ్, మెట్‌పల్లి ఖాదీ మేనేజర్


ఈ మెట్పల్లి ఖాదీ కింద మరో పది ఖాదీ బండారు నడిపిస్తూ జాతీయ భావాన్ని కొనసాగిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మెట్‌పల్లి ఖాదీ
ఇదీ చదవండి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రం ముస్తాబు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.