ETV Bharat / state

Voter Awareness Telangana : 'నేను కచ్చితంగా ఓటు వేస్తా'.. నినాదంతో హోరెత్తుతున్న తెలంగాణ

author img

By

Published : Aug 19, 2023, 1:25 PM IST

Updated : Aug 19, 2023, 1:49 PM IST

Voter Awareness programs
Voter Awareness programs in Telangana

Voter Awareness Telangana 2023 : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 'నేను కచ్చితంగా ఓటు వేస్తాను' అనే నినాదంతో జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన పరుగులో కలెక్టర్లు సహా పలువురు పాల్గొన్నారు.

Voter Awareness Telangana నేను కచ్చితంగా ఓటు వేస్తా.. నినాదంతో హోరెత్తుతున్న తెలంగాణ

Voter Awareness Telangana 2023 : ఓటు హక్కు ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఊపి పరుగు ప్రారంభించారు. ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యం తెలిపేందుకే.. ఈ కార్యక్రమాలు చెపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ముందస్తుగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని (Voter Awareness Program 2023) వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని.. యువతతో ప్రతిజ్ఞ చేయించారు.

Voter Awareness program in Mahabubabad : ఓటు హక్కు వినియోగంపై హనుమకొండలో నిర్వహించిన... '5కె రన్' ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టరేట్ వరకు సాగిన ఈ పరుగులో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు (Voter Awareness campaign 2023). మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో.. పరుగు పందెం విజేతలకు బహుమతలు అందించారు.

Voter Awareness Campaign Telangana 2023 : వర్థన్నపేటలోని అంబేడ్కర్‌ కూడలి నుంచి జాఫర్‌గడ్‌ వరకు 5కే రన్‌ ఉత్సాహంగా సాగింది. ఓటు ఆవశ్యకతపై విద్యార్థులు ప్లకార్డలు చేతబూని ర్యాలీ తీశారు. ములుగు జిల్లా కేంద్రంలో 5కిలోమీటర్ల వరకు నిర్వహించిన పరుగులో పరుగులో అధికారులు సహా పలువురు పాల్గొన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ భూపాలపల్లి జిల్లాలో.. కలెక్టర్‌ భవేష్‌ జెండా ఊపి పరుగు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సహా యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు.. ఇస్తే మాత్రం..!

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ ఖమ్మంలో ఓటు ఫర్‌ షూర్‌ పేరుతో 5కె రన్‌ నిర్వహించారు. పటేల్‌ మైదానం నుంచి లకారం ట్యాంక్‌ బండ్‌ వరకు ఈ పరుగు తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 5కే రన్‌ ఉత్సాహంగా సాగింది. అధికారులు ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓటు హక్కు మనందరి బాధ్యత... బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న... అంటూ నినాదాలతో యువత హోరెత్తించారు. వైరాలో విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని 5కే రన్‌లో పాల్గొన్నారు. రింగ్‌రోడ్‌ కూడలి నుంచి పాతబస్టాండ్‌, శాంతినగర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ఓటరు అవగాహన కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెద్దఎత్తున పాల్గొన్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో చేపట్టిన 5కే రన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. 'నేను కచ్చితంగా ఓటు వేస్తాను' అనే నినాదంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 5కే రన్ ఏర్పాటు చేశారు.

యువతకు అవగాహన పెంచుతూ : ఓటు హక్కు విలువను యువతకు తెలియజేస్తూ అధికారులు పరుగు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అటవీ శాఖ కార్యాలయం నుంచి గురుకుల పాఠశాల వరకు 5కే రన్‌ నిర్వహించారు. ఓటరు ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించిన అధికారులు.. అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 5కే రన్‌లో.. అధికారులు, విద్యార్థులు హుషారుగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఆయుధమంటూ నినదించారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఆయుధం ఓటేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఎన్నికల సంఘం పెద్దఎత్తున ఓట‌ర్లను ఎందుకు తొలగిస్తోంది

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

Last Updated :Aug 19, 2023, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.