ETV Bharat / state

లిక్కర్‌ స్కామ్‌ నుంచి దృష్టి మరల్చేందుకే 'మహిళా రిజర్వేషన్‌' నాటకం: కిషన్‌రెడ్డి

author img

By

Published : Mar 9, 2023, 5:24 PM IST

kishan reddy
kishan reddy

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ ఎవరిని ప్రశ్నిస్తుందో బీజేపీకి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్‌ చేసే అవసరం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ఈ క్రమంలోనే చట్ట సభల్లో మహిళలకు సరైన ప్రాధాన్యమివ్వని బీఆర్‌ఎస్‌కు.. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడే గుర్తుకొచ్చాయా అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం పట్ల కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ కేసులో ఈడీ ఎవరిని ప్రశ్నిస్తుందో బీజేపీకి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్‌ చేసే అవసరం తమ పార్టీకి లేదన్న ఆయన.. కేంద్రం గురించి మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత అన్ని అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. లిక్కర్‌ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన దిల్లీలో మాట్లాడారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడేందుకే నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అక్రమ వ్యాపారానికి, తెలంగాణ సమాజానికి ఎందుకు లింకు పెడుతున్నారని ప్రశ్నించిన ఆయన.. కవిత లిక్కర్‌ వ్యాపారం తెలంగాణ కోసం, మహిళల కోసం చేశారా అని నిలదీశారు. దిల్లీలో అక్రమంగా లిక్కర్‌ వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ పరువును దిల్లీలో తీశారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారన్న కిషన్‌రెడ్డి.. లిక్కర్‌ కుంభకోణంలో ఒక మహిళ ఉండటం తానెప్పుడూ చూడలేదన్నారు.

''దిల్లీలో అక్రమంగా లిక్కర్‌ వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నారు. కవిత లిక్కర్‌ వ్యాపారం తెలంగాణ కోసం, మహిళల కోసం చేశారా? లిక్కర్‌ కుంభకోణంలో ఒక మహిళ ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఈడీ ఎవరిని ప్రశ్నిస్తుందో బీజేపీకి సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్‌ చేసే అవసరం మా పార్టీకి లేదు. కల్వకుంట్ల కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకే నాటకాలు ఆడుతున్నారు.''- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మరోవైపు దిల్లీలో కవిత దీక్షపైనా కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌ కుటుంబానికి ఉందా అన్న ఆయన.. ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన పార్టీ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారా అని నిలదీశారు. మహిళల రిజర్వేషన్ల కోసం ఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీలను ఒప్పిస్తారా అని ప్రశ్నించారు. ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్‌ గుర్తుకు వచ్చిందా అని విమర్శించారు. లిక్కర్‌ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సానుభూతి కోసం కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. మహిళలను రాష్ట్రపతిగా, ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన పార్టీ బీజేపీ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

''ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్‌ గుర్తుకు వచ్చిందా? ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన పార్టీ.. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారా? రిజర్వేషన్ల కోసం ముందు ఎంఐఎంను ఒప్పిస్తారా? కేసీఆర్‌తో కలిసి తిరుగుతున్న సమాజ్‌వాదీ పార్టీని ఒప్పిస్తారా? లిక్కర్‌ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారు. సానుభూతి కోసం కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోంది. మహిళలను రాష్ట్రపతిగా, ఆర్థికశాఖ మంత్రిగా చేసిన పార్టీ బీజేపీ.'' - కిషన్‌రెడ్డి

లిక్కర్‌ స్కామ్‌ నుంచి దృష్టి మరల్చేందుకే 'మహిళా రిజర్వేషన్‌' నాటకం: కిషన్‌రెడ్డి

ఇవీ చూడండి..

కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు : కేటీఆర్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.