ETV Bharat / state

'ఆపరేషన్‌ సక్సెస్‌... పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుగా అసోం సీఎంపై కేసు నమోదు'

author img

By

Published : Feb 16, 2022, 1:42 PM IST

Updated : Feb 16, 2022, 2:13 PM IST

Revanth reddy about Assam cm case, congress protests
అసోం సీఎంపై నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకోం.. : రేవంత్

Revanth reddy about Assam cm case : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ధర్నాలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ధర్నా సమయంలో అరెస్టయిన వారిని విడుదల చేయాలని కోరారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఆయన మరో ఫిర్యాదు చేశారు. మొదటి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు కేసు నమోదు చేయలేదన్నారు. నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

అసోం సీఎంపై నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకోం.. : రేవంత్

Revanth reddy about Assam cm case : అసోం సీఎంపై పోలీసులు నమోదు చేసిన కేసు... ఆపరేషన్ సక్సెస్‌ పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుగా ఉందని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తను సూచించిన సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయలేదన్న రేవంత్‌... ఫిర్యాదు స్వరూపాన్ని మార్చారని పేర్కొన్నారు. బిశ్వశర్మపై మరోసారి ఫిర్యాదు చేసిన రేవంత్‌... సంబంధింత సెక్షన్ల ప్రకారమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. అసోం సీఎంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు రేవంత్‌కు తెలిపగా.... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ధర్నాలు ఉపసంహరించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ధర్నా సమయంలో అరెస్టయిన వారిని విడుదల చేయాలని కోరారు.

ఎఫ్‌ఐఆర్‌ కాపీని పోలీసులు చూపించాలి. వ్యవస్థపై దాడి జరిగితే ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. జాతీయ స్థాయి మహిళా నేతను అవమానించేలా అసోం సీఎం మాట్లాడారు. హిమంత బిశ్వశర్మపై నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకునేది లేదు. మేం ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలి.

-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

తమ ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మొన్న ఫిర్యాదు చేస్తే ఇవాళ ఉదయం వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వారి బాధ్యతను గుర్తు చేసేందుకే ధర్నాలు చేపట్టామన్న రేవంత్‌... ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నానన్నారు. ఆపరేషన్‌ సక్సెస్‌... పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుగా కేసు నమోదు ఉందని పేర్కోన్నారు.

నేను సూచించిన సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయలేదు. నా ఫిర్యాదు స్వరూపాన్ని మార్చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎందుకో సెక్షన్లు మార్చేసి నామమాత్రపు కేసు నమోదు చేశారు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా కేసు నమోదు ఉంది. అసోం సీఎంని రక్షించేలా పోలీసులు కేసు నమోదు చేశారు.

-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

బుధవారం ఉదయం రేవంత్ గృహనిర్బంధం

అంతకముందు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్‌ నేతలు ధర్నాలు చేశారు. రేవంత్ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు... బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ కమిషనరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్ఎస్​యూఐ నాయకులు ర్యాలీగా వచ్చి కమిషనర్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు బుధవారం ఉదయం గృహనిర్బంధం చేశారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు ధర్నాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యనేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

అసోం సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 700పైగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇవాళ ధర్నాలు చేపడతామని ఇదివరకే ప్రకటించారు. అందుకు ప్రతిగా పోలీసులు గృహనిర్బంధాలు చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టాముట్టారు. ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించి... ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డిని ఇంట్లోంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. నిజామాబాద్‌లో మధుయాష్కిని, కామారెడ్డికి వెళ్లకుండా షబ్బీర్‌ అలీని అడ్డుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశామని పోలీసులు రేవంత్​కు చెప్పగా... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ధర్నాలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం

Last Updated :Feb 16, 2022, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.