ETV Bharat / state

రాష్ట్రానికి రెండు కేంద్ర అవార్డులు.. మరోసారి ఆదర్శంగా నిలిచామంటూ మంత్రుల ట్వీట్లు

author img

By

Published : Mar 14, 2023, 1:15 PM IST

తెలంగాణ
తెలంగాణ

Telangana got two central awards : తెలంగాణ మరో రెండు ప్రతిష్ఠాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. దేశంలో నూటికి నూరుశాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ సాధించిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించినట్లు ఓడీఎఫ్‌ ప్లస్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ అధికారులు ప్రకటించారు.

Telangana got two central awards : తెలంగాణ మరో రెండు ప్రతిష్ఠాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో నూటికి నూరుశాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ సాధించిన రాష్ట్రంగా ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజున విడుదల చేసిన సర్వే ఫలితాల్లో ఈ ఘనత దక్కించుకుంది. ఓడీఎఫ్‌ ప్లస్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ అధికారులు తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులను ప్రకటించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించినట్లు వారు ప్రకటించారు.

ఓడీఎఫ్‌ ప్లస్‌ అంటే.. మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్‌గా పరిగణిస్తారు. అదనంగా గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, చెత్తను సేకరించడానికి గ్రామానికి ట్రాక్టర్‌ సమకూర్చడం, చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుల్లో తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేయడం, ఇంకుడు గుంతలు నిర్మించడం శ్మశాన వాటికను నిర్మించడం, రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి పనులు చేపడితే దానిని ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తిస్తారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్‌ ప్లస్‌, స్వచ్ఛతను పాటిస్తున్న గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేయడానికి అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, వసతుల వివరాలను నమోదు చేశారు. వీటి సమాచారం ఆధారంగా తెలంగాణ ప్రగతిని కేంద్రం గుర్తించి, పురస్కారాలకు ఎంపిక చేసింది.

తాజా పురస్కారాలపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి పనుల ద్వారానే గ్రామీణ ప్రాంతాలు నూరు శాతం అభివృద్ధిని సాధిస్తున్నాయంటూ ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు తమకు ఎల్లవేళలా సహకరిస్తున్నారని చెప్పారు.

నిజమైన పని దానంతట అదే మాట్లాడుతుంది.. స్వచ్చ సర్వేక్షణ్​లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా కేటీఆర్​ ట్విటర్​ ద్వారా స్పందించారు. నిజమైన పని దానంతట అదే మాట్లాడుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వం, ఆయన మదిలో నుంచి వచ్చిన పల్లెప్రగతి ద్వారానే తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

దేశానికి ఆదర్శం.. రాష్ట్రానికి రెండు కేంద్ర పురస్కారాలు రావడంపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ‘‘మన పల్లె సీమలు మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. డబుల్‌ ఇంజన్‌తో పని లేకుండానే డబుల్‌ ప్రతిభను ప్రదర్శించాయి.’’ అంటూ మంత్రి ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.