ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం
Telangana High Court Relief To BSP Chief RS Praveen Kumar : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కొంత మంది బీఆర్ఎస్ నేతలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాడి చేశారని ఆయనపై కాగజ్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
Telangana High Court Relief To BSP Chief RS Praveen Kumar : రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్(RS Praveen Kumar)ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగజ్‌నగర్ పీఎస్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కొంత మంది బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడి చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో అతనిపై చర్యలు తీసుకోవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కాగా.. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఇదీ జరిగింది : బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు పునీత్‌పై కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదైంది. ఈనెల 13వ తేదీన రాత్రి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ(BSP), బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఈ కేసు నమోదైంది.
BSP Election Campaign in Kagaznagar : ఈ నెల 12వ తేదీ రాత్రి నుంచి కాగజ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు (BRS Leaders) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఎస్పీ సమావేశాన్ని అణిచివేసేందుకు బీఆర్‌ఎస్ ప్రచార వాహనాలు (BRS Campaign Vehicles) మరింత బిగ్గరగా సంగీతాన్ని వినిపించాయని.. ఇవి కాస్త ఘర్షణకు దారితీసిందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్, బీఎస్పీ నాయకులు కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకు దిగారు. కానీ బీఆర్‌ఎస్ నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సోమవారం రాత్రి సైతం ఇదే విధంగా జరిగింది. దీంతో ఈ ఘటన ఇరువైపుల ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత పోలీసులు ప్రవీణ్ కుమార్, బీఎస్పీ నాయకులపై కేసు నమోదు చేశారు.
Telangana Assembly Elections 2023 : సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్ప.. తనతో పాటు, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న తన కుమారుడితో పాటు.. పార్టీకి చెందిన 11 మంది సభ్యులపై తప్పుడు కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గతంలో సిర్పూర్ ఎమ్మెల్యే అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.
