భాజపా-కాంగ్రెస్ మహిళా విభాగాల పోటాపోటీ ఆందోళనతో హైదరాబాద్‌లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో కార్యకర్తలు వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భాజపా కార్యాలయం వైపునకు దూసుకొచ్చారు.
పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భాజపా మహిళా మోర్చా నేతలు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సునీతారావు సహా ఇతర మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రెండు పార్టీల అధ్యక్షులు పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు.
ఇవీ చూడండి :