ETV Bharat / state

అయ్యప్ప మాలతో స్కూలుకు వచ్చాడని ఇంటికి పంపిన టీచర్.. ఆ తర్వాత..?

author img

By

Published : Oct 29, 2022, 10:46 PM IST

Teacher Not Allowed Student
Teacher Not Allowed Student

అయ్యప్ప మాలతో స్కూలుకు వచ్చాడని ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు మాల తీసి ఇంటికి పంపిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు.. హిందూ సంఘాలతో కలిసి పాఠశాల ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో ఆ టీచర్ చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

గత కొద్ది కాలంగా దేశంలోని పాఠశాలల్లో వస్త్రాధారణపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి అయ్యప్ప మాలధారణ వేసి స్కూలుకు హాజరయ్యాడు. దీంతో ఆగ్రహించిన సైన్స్ టీచర్ రమణారెడ్డి.. మాలతో స్కూలుకు రావద్దని, మాల తీసేయాలని సూచించాడు.

అంతేకాక అయ్యప్ప మాలను స్వయంగా తీసేయించి విద్యార్థిని ఇంటికి పంపారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, హిందూ సంఘాలు స్కూలుకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీశారు. తాను చేసింది తప్పు అంటూ విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

అయ్యప్ప మాలతో స్కూలుకు వచ్చాడని ఇంటికి పంపిన ఉపాధ్యాయుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.