ETV Bharat / state

మైనార్టీ వర్గాల అభివృద్ధికి రూ.1518.06 కోట్లు

author img

By

Published : Mar 8, 2020, 1:22 PM IST

Updated : Mar 8, 2020, 3:37 PM IST

state finance minister harish rao
మైనార్టీ వర్గాల అభివృద్ధికి రూ.1518.06 కోట్లు

రాష్ట్రంలోని మైనారిటీలు పేదరికంలో మగ్గుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.1,518.06 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనారిటీల్లోనూ పేదరికం నెలకొని ఉందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న ప్రత్యేక రాయితీలు, వసతులు కల్పించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని తెలిపారు.

మైనార్టీల సంక్షేమం కోసం 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​లో కేటాయించిన రూ. 1369 కోట్ల నిధులు ఈ నెలాఖరులోగా సంపూర్ణంగా ఖర్చుపెడతామన్నారు. షాదీ ముబారక్​ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,44,301 మంది మైనార్టీ వర్గాల యువతులు లబ్ధి పొందారని తెలిపారు.

మైనార్టీ వర్గాల అభివృద్ధికి రూ.1518.06 కోట్లు

ఇదీ చూడండి: 'ఆర్థిక మాంద్యంలోనూ రెండంకెల వృద్ధిరేటు సాధించాం'

Last Updated :Mar 8, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.