ETV Bharat / state

పండుగ ప్రయాణం.. అమ్మో మరీ ఇంతా ఖరీదా..!

author img

By

Published : Jan 10, 2023, 11:14 AM IST

Private Travels
Private Travels

Private Bus Travel Charges: అసలే పెద్ద పండగ వచ్చేస్తోంది.. సొంత వాళ్లని ఊరును వదిలి మహానగరంలో ఎదో బతుకుతున్నాం అంటే అలా బతికేస్తున్నాం.. మరి సంక్రాతికైనా వెళ్లి.. కొద్ది రోజులు సరాదాగా గడుపుదామని ట్రైన్​ టికెట్​ బుక్​ చేసుకుందామంటే మూడు నెలలు కిందటే అన్ని బుక్​​ అయ్యిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాదం అంటే అమ్మో.. పిల్లలు, లగేజీ మనవళ్ల కాదు బాబోయ్..​ మరి ఎలా ప్రైవేట్​ ట్రావెల్సే దిక్కు.. ఇదే అదును చూసి సరైనా కాటు వేస్తున్నారు ట్రావెల్స్​ ఏజేన్సీ వాళ్లు. హైదరాబాద్​ నుంచి పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రాకు వెళ్లాలంటే నెల రోజులు కష్టపడింది ఒక వైపే ఛార్జీలికే వస్తున్నాయి. ఇలా అయితే ఎలా.. వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోదా..! చెప్పండని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు.

Private Bus Travel Charges: కేపీహెచ్‌బీ ధర్మారెడ్డికాలనీ ఫేజ్‌-1కి చెందిన ఓ మహిళ తన తల్లితో కలిసి పండక్కి ఈనెల 11న రాత్రికి తణుకు వెళ్లేందుకు పదిరోజుల కిందట ప్రైవేటు ట్రావెల్స్‌లో రూ.2 వేలతో 2 టికెట్లు బుక్‌ చేసుకుంది. వారం తర్వాత సదరు ట్రావెల్స్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మీరు బుక్‌ చేసిన టికెట్లతో గిట్టుబాటు కావడం లేదంటూ ఆ రెండు టికెట్లను రద్దు చేసి డబ్బు తిరిగి పంపించారు. మరో ట్రావెల్స్‌లో బుక్‌ చేసుకుంటే 2 టికెట్లకు రూ.3 వేలు అయ్యాయి.

ఇష్టారాజ్యంగా పెంచేసి..: సొంతూళ్లకు వెళ్లేవారు ఎక్కువగా ఈనెల 12, 13నే బయలుదేరేందుకు టికెట్ల కోసం పాట్లు పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఛార్జీలకు దాదాపు 50 శాతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడంతోపాటు స్లీపర్‌ బస్సులు సైతం అందుబాటులోకి రావడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ప్రభావం పడిందని పలువురు ఏజెంట్లు చెబుతున్నారు.

రైలు ప్రయాణికులనూ ఏజెంట్లు బాదేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి నర్సాపురం వెళ్లేందుకు తత్కాల్‌లో మామూలుగా అయితే రూ.1200-1400 ఉంటే ప్రసుత్తం రూ.2 వేలు డిమాండ్‌ చేస్తున్నారు. పర్యవేక్షించే అధికారులు లేక ప్రైవేటు ట్రావెల్స్‌ది ఇష్టారాజ్యంగా మారింది. తనిఖీలూ జరగడం లేదు. డ్రైవర్లు విశ్రాంతి లేకుండా బస్సులు నడుపుతుండటంతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు సాధారణ రోజులకు, ప్రస్తుతం పండగకు ఉన్న టికెట్‌ ధరల్లో తేడా ఇలా ఉంది..

అధిక ఛార్జీల కట్టడికి తనిఖీలు: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, ఇతర వాహనాల్లో వసూలు చేసే అధిక ఛార్జీల నివారణకు సోమవారం నుంచి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించారు. ఈ రెండు జిల్లాల్లో ఐదు ప్రత్యేక బృందాలను నియమించామని రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఉన్నతాధికారి ప్రవీణ్‌రావు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.