ETV Bharat / state

కొత్త ఏడాది కొంగొత్త నిర్ణయాలు - నూతన లక్ష్యాలతో ముందుకు వెళ్తామంటున్న యువత

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 8:51 AM IST

New Year Resolutions 2024 : నూతన ఏడాది అనగానే, ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు. ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే, కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకునేవారు మరికొందరు. సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో నూతన సంవత్సరం నుంచి కాస్త జోష్ నింపాలని అనుకుంటారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం న్యూ ఇయర్ నుంచే ప్రారంభిస్తారు.

Youth in New Year Resolution
New Year Resolutions 2024

కొత్త ఏడాది కొంగొత్త నిర్ణయాలు - నూతన లక్ష్యాలతో ముందుకు వెళ్తామంటున్న యువత

New Year Resolutions 2024 : న్యూ ఇయర్​లో అడుగుపెట్టబోతున్నామనే ఆలోచనే, కుర్రకారు నుంచి వృద్ధుల దాకా నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. వారం పది రోజుల ముందు నుంచే నూతన సంవత్సరం (New Year 2024) సెలబ్రేషన్స్ ఏర్పాట్లతో పాటు. వచ్చే ఏడాదిలో ప్రారంభించాల్సిన పనుల గురించి తమ లక్ష్యాల గురించి ప్లాన్​లు వేసుకుంటారు. వీటినే రిజల్యూషన్స్ అంటారు. ఈ సంస్కృతి పాశ్చాత దేశాల నుంచి ఆసియా దేశాలకు వ్యాప్తి చెందింది.

న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్నారా​ - అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేక మార్పు : మంచి ఏదైనా సరే, ఎక్కడున్నా సరే స్వీకరిస్తే తప్పేం లేదని చాలా మంది అనుసరిస్తు‌న్నారు కూడా. మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేక మార్పు చేయాలనుకుంటే, ఓ ప్రత్యేక రోజు కోసం వెతుకుతారు. ఆ రోజు నుంచి మార్పు దిశగా ప్రయాణం సాగిస్తారు. ఎక్కువ మంది పుట్టిన రోజు, పెళ్లి రోజు లేదంటే ఏదైనా పండగను అందుకు గుర్తుగా పెట్టుకుంటారు.

"2024 సంవత్సరంలో మూడు నాలుగు నెలల్లోగా ఏదైనా ఒక ఉద్యోగంలో చేరాలని రిజల్యూషన్​ పెట్టుకున్నాను. జాబ్​ చేయడం లేదని ఏదో ఓ లోటు ఉంది. కొన్ని రోజులలో దాన్ని సాధించాలని లక్ష్యం పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం ఏవో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో జాబ్ సాధించాలని గోల్​ పెట్టుకున్నా పుడ్​, యోగా మొదలైన అంశాలపై కొత్త ఏడాదిలో పట్టు సాధించాడానికి ప్రయత్నిస్తాను." - ఓ విద్యార్థి

మార్పుకై రిజల్యూషన్స్ : న్యూ ఇయర్ కూడా అలాంటిదే ఇది, ఆంగ్ల సంవత్సరాది కాబట్టి ఆ రోజు నుంచి కొత్త నిర్ణయాలు అమలు చేయాలని చాలా మంది భావిస్తారు. గతేడాది ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త భవిష్యత్​కు ప్రణాళికలు వేసుకుని అమలు చేయడం ఆరంభిస్తారు. కొత్త సంవత్సరంలో తొలిరోజు సంతోషంగా ఉంటే మిగతా రోజులంతా అలాగే ఉంటామనేది ఓ మానసిక భావన. ఆ రోజు కొత్త రిజల్యూషన్స్​ను ప్రారంభిస్తే కచ్చితంగా సాధిస్తామని జీవితంలో పెను మార్పులకు ఇది కారణం అవుతుందని చాలా మంది నమ్మకం.

పిల్లల నుంచి వృద్ధుల దాకా వారి ఆలోచనలను బట్టి చేయాలనుకున్న పనులను బట్టి రిజల్యూషన్స్​ను పెట్టుకుంటారు. దానికై శ్రమించి విజయం సాధిస్తారు. రోజు ఏదైనా స్థిరమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే మధ్యలో కాస్త అవరోధాలు వచ్చినా పట్టు వదలకుండా పని చేసుకుంటూ పోతే ఫలితాలు తప్పక వస్తాయి.

న్యూ ఇయర్​కు కౌంట్ డౌన్ షురూ - నయాసాల్ జోష్​లో భాగ్యనగరం

Youth in New Year Resolution : వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుందనేది నానుడి. ఈ రిజల్యూషన్స్ కూడా అంతే, ప్రారంభం అనేది జరిగితే అలా చివరిదాకా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అలా చేయని వారు మధ్యలోనే చతికిలపడతారు. పరిస్థితుల కారణంగా చాలా మంది ఏడాది ప్రారంభంలో తీసుకున్న రిజల్యూషన్స్ అమలు చేయాలేకపోతారు. మరో ఏడాదిలోనైనా వాటిని సాధించాలని, తమ కలను సాకారం చేసుకోవాలని మళ్లీ ప్రయత్నిస్తారు. మలి ప్రయత్నంలో విజేతలు ఎక్కువగానే ఉంటారు.

New Year Celebrations 2024 : ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతే ప్రతి ఒక్కరూ విజయం సాధించొచ్చు. మంచి పని ప్రారంభించడానికి మంచి ముహూర్తం అంటూ ఏదీ లేదు కానీ ఏదో ఒక గుర్తు ఉండాలి. కాబట్టి చాలా మంది న్యూ ఇయర్ రోజు కొత్త పనులు, అలవాట్లు ప్రారంభిస్తారు. నేటి తరం యువతకు స్థిరత్వం కాస్త తక్కువ కాబట్టి పెట్టుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండరు అనేది కొందరి వాదన. క్యాలెండర్ మారినంత మాత్రాన పెట్టుకున్న ఎయిమ్స్​కు తగినట్లుగా శ్రమించకపోతే సరైన ఫలితాలు రావు కదా అని అంటున్నారు వారు.

న్యూ ఇయర్ 2024- మన స్టార్ల ప్లాన్స్​ ఏంటంటే?

కొత్త సంవత్సరంలో ఫైనాన్షియల్ గోల్స్ - ఇలా సెట్ చేసుకుంటే తిరుగుండదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.