ETV Bharat / entertainment

న్యూ ఇయర్ 2024- మన స్టార్ల ప్లాన్స్​ ఏంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 12:00 PM IST

Celebrities New Year Plans : టాలీవుడ్​ సెలబ్రిటీలు న్యూఇయర్​ వేడుకలను జరుపుకునేందుకు విదేశాలకు పయనమవుతున్నారు. ఎన్టీఆర్, అల్లుఅర్జున్ ఇప్పటికే ఫారిన్​ వెళ్లిపోయారు. మరికొందరు త్వరలోనే వెళ్లనున్నారు. మరి టాలీవుడ్ స్టార్ల న్యూఇయర్ ప్లాన్స్​ ఏంటంటే?

Celebrities New Year Plans
Celebrities New Year Plans

Celebrities New Year Plans : మరో మూడు రోజుల్లో 2023 ముగియనుంది. కొత్త సంవత్సరం 2024కు వెల్​కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా రెడీ అవుతోంది. చాలా మంది డిసెంబర్​ 31వ తేదీ రాత్రి గ్రాండ్​గా​ సెలబ్రేట్ చేసుకుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఈ వేడుకల్లో హడావుడి చేయడం మామూలుగా ఇండదు. సినిమా స్టార్స్ అయితే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తారు.

ఇండియాలో అయితే సెలబ్రిటీ ఇమేజ్ కారణంగా బయట సాధారణంగా తిరగలేరు. అందుకే విదేశాలకు వెళ్లి ఎంచక్కా సామాన్యుల మాదిరిగా తిరిగేస్తూ హ్యాపీగా ఇంగ్లీష్ సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అందుకు కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు విదేశాలకు పయమనమయ్యారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​ ఇప్పటికే తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్​ వెళ్లిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ జరుపుకుని జనవరి ఫస్ట్ వీక్​లో మళ్లీ ఇండియా రానున్నారు. సంక్రాంతి తర్వాత దేవర మువీ షూటింగ్​లో జాయిన్​ అవ్వనున్నారు. ఇటీవలే ఎయిర్​పోర్ట్​కు వెళ్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ వీడియోలు వైరల్​గా మారాయి.

సూపర్ స్టార్ మహేశ్​ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్తున్నారు. మహేశ్​ తనయుడు గౌతమ్ కృష్ణ న్యూయార్క్​లో చదువుతున్నాడు. దీంతో ఫ్యామిలీ అందరూ అక్కడికి వెళ్లి న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నమ్రత, సితార న్యూయార్క్ వెళ్లిపోయారు. మహేశ్​ బాబు గుంటూరు కారం షూటింగ్ ముగించుకుని వెళ్లనున్నారు.

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిపోయారు. అక్కడ ఈ వీకెండ్ మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్​ను ఆస్వాదించబోతున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ కోసం యూఎస్ లో ఉన్నారు. అతను కూడా కొత్త సంవత్సర వేడుకలకు యూఎస్​లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
హీరోయిన్ రష్మిక మందన్న తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్​తో న్యూఇయర్ వేడుకలకు రెడీ అవుతోంది. శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్​తో కొత్త సంవత్సర వేడుకలు చేసుకోబోతోంది. ఇతర సెలబ్రిటీ స్టార్స్ కూడా వేడుకలను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.