ETV Bharat / state

రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : సీపీ అవినాశ్ మహంతి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 4:35 PM IST

Updated : Dec 31, 2023, 5:23 PM IST

New Year Celebrations Restrictions in Cyberabad : కొత్త ఏడాది రోజున రోడ్లపై కేకు కట్​ చేయవద్దని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి హెచ్చరించారు. సైబరాబాద్​ పరిధిలో న్యూయర్​ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని సూచించారు.

New Year Celebrations
New Year Celebrations Restrictions in Cyberabad

New Year Celebrations Restrictions in Cyberabad : నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో నూతన ఏడాది 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈక్రమంలో పోలీసు శాఖ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తమైంది. సైబరాబాద్​లో నూతన సంవత్సర(New Year) ఆంక్షలు విధించామని సీపీ అవినాశ్​ మహంతి తెలిపారు. సైబరాబాద్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు ఆంక్షలను ప్రజలకు వివరించారు.

అందరూ సంతోషంగా న్యూయర్​ జరుపుకోవాలని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి ఆకాంక్షించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా సెలబ్రేషన్స్​ చేసుకోవాలని సూచించారు. సైబరాబాద్​ పరిధిలోని పై వంతెనలు, ఓఆర్​ఆర్​, పీవీ ఎక్స్​ప్రెస్​ వేపై రాకపోకలకు అనుమతి నిరాకరించామని చెప్పారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : సీపీ అవినాశ్ మహంతి

New Year 2024 Celebrations Hyderabad : ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్(Drunk and Drive)​ తనిఖీలు చేస్తారని సీపీ అవినాశ్ మహంతి వివరించారు. బైకులు, కార్లతో స్టంట్స్​, ఓవర్​ స్పీడ్​గా వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం పెట్రోలింగ్ టీం, క్రైమ్​ టీం, షీ టీమ్స్​ విధుల్లో ఉంటారని వెల్లడించారు.

హైదరాబాద్​లో న్యూయర్​ వేడుకలపై పోలీసుల ఆంక్షలు - రాత్రి 1 గంట వరకే పర్మిషన్

న్యూయర్​ వేళ ఈవెంట్స్​కు పర్మిషన్​ అడిగిన వారికి కొన్ని గైడ్​ లైన్స్​ ఇచ్చామని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి తెలిపారు. ఎవరైనా సరే రూల్స్​ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకల్లో ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడితే డయల్​ 100(Dail 100)కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే అక్కడకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

New Year Guidelines in Cyberabad : ఎవరైనా ర్యాష్​ డ్రైవింగ్​ చేస్తే అలాంటి వాహనాల కోసం ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్​ విషయంలో పబ్స్​ యాజమాన్యం బాధ్యత వహించాలని చెప్పారు. పబ్​ పార్కింగ్​ ప్లేస్​లలో సీసీ కెమెరాల నిఘా ఉండాలని పబ్స్​ యాజమాన్యానికి సూచనలు చేశారు. కొత్త ఏడాది రోజు రోడ్లపై కేక్​ కట్టింగ్స్​ చేయవద్దని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"ప్రతి ఒక్కరు న్యూయర్​ వేడుకలను జరుపుకోవాలి. చాలా జాగ్రత్తగా వేడుకలను జరుపుకోవాలి. ఈ వేడుకలు కూడా కొన్ని నిబంధనలకు లోబడి చేసుకోవాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వేడుకలు చేసుకోవాలి. ఫ్లైఓవర్లు, ఓఆర్​ఆర్​, పీవీ ఎక్స్​ప్రెస్​ వేలు బ్లాక్​ చేయడం జరిగింది. విమానాశ్రయానికి వెళ్లేవారు టికెట్లు చూపిస్తే పంపిస్తాం." - అవినాశ్​ మహంతి, సైబరాబాద్​ సీపీ

సైబరాబాద్​లో పోలీసుల ఆంక్షల వివరాలు :

  • సైబరాబాద్ పరిధిలోని పై వంతెనలు, ఓఆర్​ఆర్, పీవీ ఎక్స్​ప్రెస్​ వేలపై రాకపోకలకు అనుమతి లేదు.
  • స్టంట్స్, ఓవర్ స్పీడ్ వెళ్లిన వారిపై కఠిన చర్యలు
  • పెట్రోలింగ్ టీం, క్రైమ్ టీం, షీ టీమ్స్ విధుల్లో ఉంటాయి
  • ఈవెంట్స్​కు పర్మిషన్​ అడిగిన వారికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాము, ఆ రూల్స్​ అతిక్రమిస్తే చర్యలు.
  • ఎవరైనా ఇబ్బందిపెడితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలి
  • ర్యాష్ డ్రైవింగ్ వాహనాల కోసం ప్రత్యేక కెమెరాలు నిఘాలో ఉన్నాయి.
  • డ్రగ్స్ విషయంలో పబ్స్ యాజమాన్యం బాధ్యత వహించాలి.
  • పబ్ పార్కింగ్ ప్లేస్​లలో సీసీ కెమెరాలతో నిఘా ఉంచాలి.
  • రోడ్లపై కేకులు కట్​ చేయవద్దు.

న్యూయర్​ స్పెషల్​ - మెట్రో టైమింగ్స్​ పెంపు, లాస్ట్​ ట్రైన్ ఎప్పుడంటే?

హైదరాబాద్​లో న్యూయర్​ వేడుకలకు రాచకొండ సీపీ హుకుం - యువత జరభద్రం ఇక

Last Updated : Dec 31, 2023, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.