మురికిమయంగా మారిన మూసీ నది - ప్రక్షాళన ఎంతవరకు వచ్చింది?

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 11:36 AM IST

Musi River

Musi River Purification Process : ఒకప్పుడు ఆ నది చరిత్ర ఎంతో ఘనం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్మించిన ఆ నది నీరు, సాగు, తాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడేది. దాంతో హైదరాబాద్‌ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం కలిగేది. అంత గొప్ప చరిత్ర కల్గిన అది నేడు కాలుష్యమయంగా మారి, దుర్గంధం వెదజల్లుతోంది. అదే మూసీ నది. మురికినీటి ప్రవాహం కల్గిన మూసీ నది చుట్టుపక్కలకు వెళ్లినా ,గాలి పీల్చలేని పరిస్థితి. దేశంలోని అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగానూ చేరింది. మరి మూసీనది కాలుష్యమయంగా మారడానికి కారణాలేంటి.? మూసీ ప్రక్షాళనే జరిగితే కలిగే ప్రయోజనాలేంటి.? ఆ దిశగా ఏమైనా అడుగులు పడ్డాయా?ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

మురికిమయంగా మారిన మూసీ నది

Musi River Purification Process : ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కి పచ్చని పంటలు, జలచరాలు, చుట్టూ స్వచ్ఛమైన గాలితో కళకళలాడిన మూసీ నది పరివాహాక ప్రాంతాలన్నీ, నేడు మురికి కూపాలుగా మారాయి. అప్పట్లో ఈ నది నీటితో చక్కటి పాడి, పంటలతోపాటు చేపల పెంపకం సమృద్ధిగా జరిగేది. లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగై నాణ్యమైన ఉత్పత్తులు చేతికొచ్చేవి. ఈ పరిస్థితి ప్రస్తుతం తలకిందులైంది. ముఖ్యంగా మూసీ పరివాహక గ్రామాల ప్రజలు కాలుష్య కాటుతో కొట్టుమిట్టాడుతున్నారు.

వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి, హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంది మూసీ నది (Musi River). ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. మొత్తంగా 267 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణిస్తుంది. హిమాయత్‌సాగర్, గండిపేట నుంచి మొదలుకుని తూర్పు వైపున ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 57.5 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌లో మూసీ ప్రవాహిస్తుంది. ఈ నది పరివాహక ప్రాంతం వెంట 12,000కు పైగా పరిశ్రమలు ఉన్నాయి.

HC CJ on MUSI: 'హుస్సేన్​సాగర్​ దగ్గర ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా'

రాష్ట్ర పొల్యూషన్ బోర్డు అధ్యయనం ప్రకారం, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి రోజూ మిలియన్ లీటర్ల సాధారణ, పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయి. రెండేళ్ల కిందట దాదాపు 350 మిలియన్ లీటర్లు కలిసే కాలుష్య నీరు, క్రమంగా పెరిగి 1652 మిలియన్ల లీటర్లకు పెరిగింది. ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే నీరు మూసీని ఎక్కువగా కలుషితం చేస్తోంది. ప్రధానంగా మూసీనది హైదరాబాద్‌లోకి ప్రవేశించిన తర్వాత మురుగు నీరు నేరుగా కలిసి నదీ జలాలు కలుషితం అవుతున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో మూసీలో కలిసే 54 ప్రధాన నాలాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే 94 శాతం మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ప్రవహించే మూసీ నది పొడవునా ఉన్నా, చెరువులు, నీటి వనరులన్నీ కూడా విషరసాయనాలతో పేరుకుపోయి కాలుష్యమయంగా మారాయి.ఈ నీటితో వరి పంట సాగు చేసినా, దానిని ఆహారంగా తీసుకునే పరిస్థితి లేదు. మూసీ సమీప చెరువుల్లోని చేపలు కూడ మృత్యువాత పడుతున్నాయి.

Musi River Cleaning : మూసీ నది కాలుష్యంతో జలజీవాలు దాదాపు అంతరించపోగా, పశుసంపద కూడా క్రమేపీ కనుమరుగవుతోంది. ఈ నీరు తాగిన పశువులు అనారోగ్యాల పాలవుతున్నాయి. దీంతో పశువులను పెంచలేక పాడి రైతులు, దళారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయి. ఆ నీటితో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంట పొలాల్లో పనిచేస్తే శరీరం దద్దుర్లు పెట్టడం, చర్మ సంబంధ వ్యాధుల బారినపడం రైతులు, కూలీల్లో నిత్యకృత్య సమస్యగా పరిణమించింది.

musi project canal land occupation: కబ్జా కోరల్లో మూసీ కాలువ.. రాజకీయ, ఆర్థిక పలుకుబడితో ఆక్రమణలు!

మురికికూపంగా మారిన మూసీ ప్రక్షాళన కోసం 2017లో నాటి ప్రభుత్వం, మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ- ఎంఆర్డీసీని (MRDC) ఏర్పాటు చేసింది. మూసీ నదిని ప్రక్షాళన చేయడం, పరివాహక ప్రాంతాలను సుందరీకరించడం తదితర పనులు ఎంఆర్డీసీ లక్ష్యం. మురికికూపంగా మారిన నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం రూ.16,635 కోట్లు అవసరమవుతాయని, అప్పట్లో ఎంఆర్డీసీ, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ అంచనా వేశాయి.

Most Polluted River in Musi : అందులో రోడ్లు వేయడానికి రూ.9000ల కోట్లు, 31 ప్రాంతాల్లో శుద్ధికేంద్రాల ఏర్పాటుకు 3,866 కోట్లు, సుందరీకరణ కోసం రూ.2,000 కోట్లు అవసరం అవుతాయని లెక్కకట్టారు. దీనికితోడు మూసీపై 14వంతెనలు నిర్మించేందుకు రూ.545 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు అప్పటి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా ఈ పనులన్నీ జరగాలంటే మొదటిదశలో మురుగునీటి శుద్ధి జరగాల్సి ఉంది.

Musi Development Project : హైదరాబాద్‌ సీవరేజీ బోర్డు పరిధిలో, రోజూ దాదాపు 2,000ల మిలియన్‌ గ్యాలన్‌ పర్‌ డే మురుగునీరు వస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఇందులో 772 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి 25 ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. మరో 1259 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో 11 ఎస్టీపీలు పూర్తి కావస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు కోరుతున్నారు. అందుకు గోదావరి నీటిని మూసీలో కలపాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు జిల్లాకు చేరగా, త్వరలోనే వాటిని మూసీలో కలపాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ తొమ్మిదున్నర ఏళ్లైనా నెరవేరకపోవడంతో సమస్యలు మరింత రెట్టింపయ్యాయి. కాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన దృష్ట్యా ఈ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Musi River Beautification : మూసీ సుందరీకరణ నిధులు జేబుల్లోకి.. పనులు గాల్లోకి

మూసీ ప్రక్షాళన అంటే నది ఉద్భవించిన ప్రదేశం నుంచి ముగింపు వరకు జరగాలి. మూసీ ప్రక్షాళనను కూడా హైదరాబాద్‌ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాను ఒక భాగంగా చూడాలి. పుట్టుక, ప్రవాహం ముగింపు ఇలా అన్ని ఒకే రాష్ట్రంలో ఉండటం దీని ప్రత్యేకత. ఈ నేపథ్యంలో నదిని కాపాడే పూర్తి బాధ్యత రాష్ట్రానిదే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మూసీ పరివాహ ప్రజలకు మేలు జరగడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుతుందనేది వ్యవసాయ, పర్యావరణవేత్తల అభిప్రాయం.

Musi River Purification : 'మూసీ నది ప్రక్షాళనకు ప్రతిపాదనలు.. కేంద్రం వద్ద పెండింగ్‌లో లేవు'

మూసీ ఉగ్రరూపం.. పరీవాహక ప్రాంతాల్లోని బస్తీలను ముంచెత్తిన వరద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.