ETV Bharat / state

Mother Daughter Bonding Tips Telugu : మా అత్తగారింట్లో సంతోషంగానే ఉన్నా.. నిజం అమ్మా..!

author img

By

Published : Aug 8, 2023, 2:16 PM IST

Clashes Between Mother and Daughter
Disturbances between Mother and Daughter

Mother Daughter Bonding Tips Telugu : నాకు పెళ్లై నాలుగు సంవత్సరాలు అవుతోంది. మేము మా అత్తమామలతో కలిసి సంతోషంగా ఉంటున్నాం. నాకు అత్తగారింట్లో ఎలాంటి సమస్యలు లేవు. కానీ.. మా అమ్మ మేం విడిగా కాపురం పెట్టాలని అంటోంది. నా భర్త నేను.. విడిగా కాపురం పెడితే బాగుంటుందని మా అమ్మ అనుకుంటుంది. దాంతో మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఓ విషయంలో మా అత్తగారితో కావాలని గొడవ పెట్టుకుంటుంది. దీనివల్ల మా అత్తగారికి నాకు మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయి. మా అమ్మని ఎలా మార్చాలో తెలియడం లేదు, దయచేసి నాకు సలహా ఇవ్వగలరు.

Mother Daughter Bonding Tips Telugu : ఎక్కడైనా మనం అత్తాకోడళ్ల మధ్య గొడవలు చూస్తాం. వాళ్ల ఇద్దరికి పడకపోవడం.. అత్తతో గొడవ వల్ల వేరే కాపురం పెట్టడం వంటివి చూస్తుంటాం. క్లియర్​గా చెప్పాలంటే అత్తాకోటళ్ల మధ్య గొడవ అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణం. అయితే ఇక్కడ మాత్రం రివర్స్. అత్తగారింట్లో ఉండటం ఈ మహిళకు ఇష్టం. కానీ ఆమె తల్లికి మాత్రం ఇష్టం లేదు. అత్తగారింట్లో ఏదైనా సమస్య వస్తే సర్దుకు పోయి ఉండమని కూతుళ్లకు సర్దిచెప్పే తల్లులను చూశాం.

కానీ ఈ తల్లి మాత్రం కాస్త డిఫరెంట్. ఎలాంటి కలహాలు లేకుండా హాయిగా సాగిపోతున్న కూతురును వేరు కాపురం పెట్టమని ఎంకరేజ్ చేస్తోంది. కానీ ఆ కూతురేమో తనకు అత్తగారింట్లో ఉండటమే ఇష్టమంటోంది. ఈ విషయం తన తల్లికి చెప్పినా అర్థం చేసుకోవడం లేదట. గట్టిగా చెబుదామంటే తల్లితో అలా మాట్లాడటం సరికాదనిపిస్తోందట. మరి ఈ మహిళ సమస్యకు మన రిలేషన్​షిప్ అడ్వైజర్ ఏం సలహా ఇచ్చారో ఓసారి చూద్దామా..? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.. మీకూ ఇలాంటి సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం ఆలోచించాలో ఇది చదివి తెలుసుకోండి.

భూమి కోసం అత్తాకోడలు పోరాటం.. కలెక్టరేట్​ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం.!

'చాలా కుటుంబాల్లో అత్తాకోడలి మధ్య గొడవలు రావడం సాధారణంగా చూస్తుంటాం (Mother in Law and Daughter in Law Fights). కానీ మీ విషయంలో భిన్నంగా మీ అమ్మగారి వల్ల సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. మీ అమ్మగారితో సమస్య ఉందని నిజాయితీగా చెప్పుకోవడం అభినందనీయం. అయితే ఒక కోడలిగా మీ అత్తగారితో ఎంత సఖ్యత అవసరమో మీ అమ్మగారితో కూడా అంతో ఉండాలి. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు. కాబట్టి మీ అమ్మగారితో ఎలాంటి గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నించండి.

వాళ్ల కోణంలోనే ఆలోచిస్తారు : కొంత మందిి కొన్ని అంశాల మీద వ్యతిరేక భావనలు ఉంటాయి. దానివల్ల వారు ఆ అంశాలను అదే కోణంలో చూస్తారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ అమ్మగారు(Mother and Daughter Relationship) కూడా ఇలాంటి ధోరణిలోనే ఉన్నారనిపిస్తోంది. మీరు మీ అత్తగారితో కలిసి ఉంటున్నామని చెబుతున్నారు. అంటే మీ అమ్మగారు మీ ఇంటికి వచ్చే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి మీ అమ్మగారు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పనులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ఆ పనులు తగ్గించండి : అలాగే ఆమె ఏ విషయాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారని అపోహ పడుతున్నారో అ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. ఇలా చేయడం వల్ల ఆమెలో మార్పు వస్తుందేమో పరిశీలించండి. ఒకవేళ మీ అమ్మగారి ప్రవర్తనలో మార్పు రాకపోతే మీ తోబుట్టువులతో చెప్పించే ప్రయత్నం చేయండి. మీరు మీ అత్తగారితో ఉన్న అన్యోనతను ఆమెకు అర్థం అయ్యేలా చూపించడం. అప్పటికి ఎలాంటి మార్పు కనిపించకపోతే ఒకసారి మీ అమ్మగారిని మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్లండి. వారు ఆమె ఆలోచనా విధానం మార్చుకునేందుకు సలహాలు, సూచనలు ఇస్తారు.

మగాడి వేషం వేసుకుని వచ్చి కోడలి దాడి.. తీవ్ర గాయాలతో అత్త మృతి

ఆస్తి కోసం అత్త, మామ హత్య.. కిల్లర్లను పిలిచి టెర్రస్​పై దాచి.. కోడలి పక్కా ప్లాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.