ETV Bharat / state

ఏ చట్టం ప్రకారం మంత్రి గాల్లో కాల్పులు జరిపారని ప్రశ్నించిన రఘునందన్‌

author img

By

Published : Aug 14, 2022, 1:31 PM IST

రఘునందన్‌రావు
రఘునందన్‌రావు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నిన్న మహబూబ్‌నగర్‌లో ఏ చట్ట ప్రకారం తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. వెంటనేే సీఎం కేసీఆర్ ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీనివాస్‌ గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్‌ అయ్యాక వచ్చే సలహాదారు పోస్టు కోసమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఏ చట్ట ప్రకారం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తుపాకి తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారని ఆయన ప్రశ్నించారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్​కు ఏమైనా లైసెన్స్‌ ఉందా అని రఘునందన్‌రావు అడిగారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారని ప్రశ్నించారు. మంత్రి పేల్చిన తుపాకిని ఫోరెన్సిక్‌ ల్యాబ్​కు పంపాలని తెలిపారు. లేదంటే రిట్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్‌రావు కోరారు.

"భారతీయ శిక్షా స్మృతి, రాజ్యాగం ప్రకారం ఈ చట్టాలలో ఎక్కడ అన్న ఎస్పీకి ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా. ఒక బాధ్యత గల మంత్రి తన గన్​మెన్ దగ్గర నుంచి తీసుకున్నారు. దాని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ నేనే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారు. దీనికి బాధ్యతగా ఎస్పీపై చర్యలు తీసుకోవాలి. శ్రీనివాస్ గౌడ్‌ను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలి. - రఘునందన్‌రావు, భాజపా ఎమ్మెల్యే

అసలేం జరిగిదంటే: మహబూబ్‌నగర్‌ ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపటం కలకలంరేపింది. జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌ టవర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ర్యాలీ ప్రారంభ సమయంలో తుపాకీతో గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి కాల్పులు జరపటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కాసేపు ఈ ఘటన వివాదానికి దారితీయటంతో.. మంత్రే స్వయంగా వివరణ ఇచ్చారు. ఫ్రీడం రన్‌ ప్రారంభోత్సవం వేళ రబ్బర్‌ బుల్లెట్‌ తుపాకీని తాను పేల్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. తనకు ఎస్పీనే స్వయంగా తుపాకీ ఇచ్చారని వివరించారు. గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవ సమయంలో రబ్బర్ బుల్లెట్‌ పేల్చినట్లు చెప్పారు. కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఏ చట్టం ప్రకారం మంత్రి గాల్లో కాల్పులు జరిపారని రఘునందన్‌రావు ప్రశ్నించారు

ఇవీ చదవండి: రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

ప్రముఖుల ఇళ్లలో వెల్లివిరిసిన అనుబంధాల వేడుక చిత్రమాలిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.