ETV Bharat / state

పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కమిటీలు: తలసాని

author img

By

Published : Mar 10, 2022, 1:58 PM IST

MInister talasani srinivas yadav talk about Dairy industry in assembly sessions 2022
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

MINISTER TALASANI ON DAIRY INDUSTRY: పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభలో పేర్కొన్నారు. పాడి పరిశ్రమను మరింతగా ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కమిటీ వేయనున్నట్లు తెలిపారు.

MINISTER TALASANI ON DAIRY INDUSTRY:

రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింతగా ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కమిటీ వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించాలని కోరుతూ అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దళితబంధు లబ్ధిదారులు సైతం పాడి యానిట్లు ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విజయ డైరీ టర్నోవర్ 750 కోట్లు దాటిందని వెల్లడించారు.

రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మండలాల వారీగా కమిటీ వేస్తాం. ఇన్సెంటివ్ విషయంలో ప్రభుత్వం ఆలస్యం అయినప్పటికీ... దశలవారీగా పూర్తి చేస్తాం. రాష్ట్రంలో పాడి సంపదను పెంపొందించడానికి.. దళితబంధు లబ్ధిదారులు పాడి యూనిట్లు ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే.. రాష్ట్రంలో విజయ డైరీ టర్నోవర్ 750 కోట్లు దాటింది.

- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పశుసంవర్ధక శాఖ మంత్రి

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రసంగం


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.