ETV Bharat / state

KTR: 'తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేది తెరాస మాత్రమే'

author img

By

Published : Jul 12, 2021, 2:31 PM IST

KTR
మంత్రి కేటీఆర్

గులాబీ కండువా కప్పి ఎల్​.రమణకు మంత్రి కేటీఆర్ స్వాగతం తెలిపారు. పార్టీ సభ్యత్వం ఇచ్చి లాంఛనంగా ఆహ్వానించారు. తెలంగాణ ప్రయోజనాలను రక్షించేంది తెరాస మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేది తెరాస మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఎల్​.రమణకు పార్టీ సభ్యత్వం ఇచ్చి... తెరాసలోకి లాంఛనంగా ఆహ్వానించారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల్ని గులాబీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలిగారు.

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

రెండు పదవులు రాగానే కొందరు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కేసీఆర్ ముందు కుప్పిగంతులు వేసినట్లే. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నవారు కానీ.. పలు సందర్భాల్లో మనతో విభేదించిన వారు కానీ ఈ రోజు కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని నమ్ముతున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేవలం తెరాసతోనే జరుగుతుందని నమ్మి... మనతో కలిసి పని చేసేందుకు వస్తున్నారు. కాంగ్రెస్, భాజపా వాళ్లకు తెలంగాణ అనేది 28 రాష్ట్రాల్లో ఒకటి. వారికి మన రాష్ట్రమేమి ప్రాధాన్యత కాదు. కానీ తెరాసకు తెలంగాణ మాత్రమే. ద్వంద్వ ప్రమాణాలు లేకుండా.. రెండు నాలుకలు లేకుండా... రాజీ లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక పార్టీ తెరాస.

-మంత్రి కేటీఆర్

'తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేది తెరాస మాత్రమే'

జవహర్‌నగర్ అభివృద్ధిలో వెనుకబడి ఉందన్న మంత్రి.. ఎంత చేసినా అక్కడి ప్రజల రుణం తీర్చుకోలేమన్నారు. డంపింగ్‌ యార్డుతో ఎదురవుతున్న ఇబ్బందులను క్రమంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 250 కోట్ల రూపాయలతో శుద్ధీకరణ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి: L.Ramana: కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన ఎల్.రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.