ETV Bharat / state

'కాంగ్రెస్​కు సీఎంలు దొరికారు - ఓటర్లే దొరకట్లేదు, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే హైదరాబాద్​ అభివృద్ధి ఆగిపోతుంది'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 4:00 PM IST

Minister KTR Participated in Telangana Advocates Atmiya Sammelanam : తెలంగాణ సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించాలని.. మోదీ, రాహుల్‌ గాంధీ కాదని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ సింహం లాంటి వారని.. సింగిల్‌గా వస్తారని స్పష్టం చేశారు.

Telangana Advocates Atmiya Sammelanm
Telangana Advocates Atmiya Sammelanm

Minister KTR Participated in Telangana Advocates Atmiya Sammelanam : కేసీఆర్‌ సింహం లాంటి వారని.. సింగిల్‌గా వస్తారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌(Minister KTR) అన్నారు. తెలంగాణ సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించాలని.. మోదీ, రాహుల్‌ గాంధీ కాదని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో న్యాయవాదుల కోసం వైద్య బీమాను పెంచనున్నామని.. వారి సమస్యలన్నీ తీర్చే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్‌ న్యాయవాదులకు హామీ ఇచ్చారు. అడ్వకేట్‌ ట్రస్ట్‌(Advocate Trust)ను రూ.500 కోట్లకు పెంచుతామని తెలిపారు.

Minister KTR Fires on Congress : అనంతరం ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన ఆయన.. కాంగ్రెస్‌లో సీఎంలు దొరికారు కానీ ఓటర్లు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. జానారెడ్డి పోటీ చేయరని.. కానీ ఆయనకు సీఎం పదవి కావాలని మండిపడ్డారు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం రిస్క్‌ తీసుకోవద్దని.. సొంత నిర్ణయాలు తీసుకునే నాయకుడు కాంగ్రెస్‌, బీజేపీల్లో లేరన్నారు. ఈ ఎన్నికల పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి పోరాటాలు తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదన్నారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీతోనూ కొట్లాడామని గుర్తు చేశారు. ఆ తర్వాత సోనియాతోనూ.. ఇప్పుడు మోదీతో కొట్లాడుతున్నామన్నారు. తమకు రావాల్సిన హైకోర్టును రాకుండా ఐదేళ్లు సతాయించారని ఆరోపించారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు(Karnataka Current Issue) ఇస్తున్నామని డీకే శివకుమార్‌ అంటున్నారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని.. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. కేసీఆర్‌ సింహం లాంటి వారని.. సింగిల్‌గానే వస్తారని స్పష్టం చేశారు.

KTR Respond to Election Schedule : 'తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. బీఆర్‌ఎస్‌దే..!'

ఒక్క లేఖలో ఫాక్స్‌కాన్‌ను కర్ణాటకు తీసుకెళ్లిన డీకే శివకుమార్ : హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్‌ సంస్థను కర్ణాటకలో పెట్టాలని డీకే శివకుమార్‌ లేఖ రాశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిశ్రమలన్నీ కర్ణాటకకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి ఉందని.. ఇక్కడ ఐటీ(IT) ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 24 వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రంలోకి వచ్చాయన్నారు.

Telangana Assembly Election 2023 : ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని వివరించారు. హైదరాబాద్‌ అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నా.. విపక్షాలకు కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

KTR Meeting with Students : 'తెలంగాణ సాధించిన ప్రగతిని.. ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.