ETV Bharat / state

భాజపా మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలి: కొప్పుల ఈశ్వర్

author img

By

Published : Sep 4, 2022, 8:26 PM IST

భాజపా మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలి: కొప్పుల ఈశ్వర్
భాజపా మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలి: కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar Comments on Dalitha bandhu: దేశవ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.

భాజపా మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలి: కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar Comments on Dalitha bandhu: దేశవ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే తన మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని సవాల్​ విసిరారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని కొప్పుల ఈశ్వర్​ మండిపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరగడమే కాక సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. యూపీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

భాజపాకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ప్రేమ ఉండదని కొప్పుల వ్యాఖ్యానించారు. దళితబంధు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి.. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతామని తెలిపారు. భాజపా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే తెలంగాణ విలీన దినోత్సవాన్ని వాడుకోవాలని చూసిందని కొప్పుల విమర్శించారు.

దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే తన మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలి. దేశవ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలి. భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి. భాజపాకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ప్రేమ ఉండదు. దళితబంధు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతాం. - కొప్పుల ఈశ్వర్​, సంక్షేమ శాఖ మంత్రి

అలా అడగటం శోచనీయం..: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పేర్కొన్నారు. దిల్లీ నుంచి గల్లీకి వచ్చి మోదీ ఫొటో పెట్టలేదని అడగటం శోచనీయమన్నారు.

ఇవీ చూడండి..

భాజపాపై పోరుకు ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు కలసి రావాలి: డి.రాజా

కేంద్రమంత్రి గారు.. మోదీ సర్కార్ చేసిన అప్పుల సంగతేంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.