ETV Bharat / state

అమెరికా, చైనాలాగా భారీ లక్ష్యాన్ని పెట్టుకొని అగ్రగామిగా ఎదగాలి: కేటీఆర్

author img

By

Published : Dec 13, 2022, 2:25 PM IST

Ktr On Japanies Manufacturing: చైనా వెలుపల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయాలన్న వివిధ ప్రపంచదేశాల ఆలోచనలకు అనుగుణంగా అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దశాబ్దాల క్రితం అమెరికా, చైనాలు ఎలాగైతే భారీ లక్ష్యాన్ని పెట్టుకొని అగ్రగ్రామిగా ఎదిగాయో.. అంతే వేగంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో దైఫుక్ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ktr
కేటీఆర్

అమెరికా చైనా లాగా భారీ లక్ష్యాన్ని పెట్టుకొని అగ్రగామిగా ఎదగాలి: కేటీఆర్

Ktr On Japanies Manufacturing: ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ సరఫరాదారుగా ఉన్న జపాన్ కంపెనీ దైఫుక్.. రాష్ట్రంలో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో రూ.200 కోట్లతో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడికి ప్రణాళిక రూపొందించిన కంపెనీ.. వచ్చే 18 నెలల్లో నూతన పరిశ్రమను ప్రారంభించాలని యోచిస్తోంది. మేక్ ఇన్ ఇండియా వంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్న భారత్.. ప్రస్తుత అవకాశాలకు ఇవి ఏ మాత్రం సరిపోవని కేటీఆర్ తెలిపారు. భారీ లక్ష్యాలతో ముందుకెళ్లాలని కేటీఆర్ సూచించారు.

చైనా వెలుపల ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవాలి. అమెరికా గత 30ఏళ్లలో ఏం చేసిందో మనం వచ్చే పదేళ్లలో అదే చేయాలి. చైనా గడచిన 25ఏళ్లలో ఏం చేసిందో వచ్చే పదేళ్లలో మనమూ అదే చేయాలి. మాకు అవకాశాలు లేవని.. హోదా లేదని.. కప్ప గెంతులు వేయకూడదు. మనం ఒక్కసారిగా ముందుకు దూకాలి.- కేటీఆర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి

అత్యాధునిక ఉత్పత్తి రంగంపైనే కాదు.. ప్రాథమిక ఉత్పత్తి రంగంపైనా దృష్టిపెట్టాలని కేటీఆర్ సూచించారు. 'మేక్‌ ఇన్‌ ఇండియా' సహా ప్రపంచ తయారీ అంశాలపై మనం మాట్లాడుతున్నామని.. దురదృష్టవశాత్తు ఈ కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రపంచస్థాయికి తగ్గట్టుగా లేవన్నారు. మనం మరింత విశాలంగా, ఆశావాహ దృక్పథంతో, దూకుడుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.