ETV Bharat / state

ఏపీలోని నెల్లూరులో రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

author img

By

Published : May 11, 2020, 12:08 AM IST

అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని బాలాజీ కెమికల్స్ పరిశ్రమ​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షించారు.

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డులో ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో అతికష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిశ్రమలో హైడ్రోజన్ పెరాక్సైడ్​తో పాటు పలు రసాయనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలను... అధికారులు ఖాళీ చేయించారు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని మంత్రి తెలిపారు. నష్టం అంచనాలతో పాటు, ప్రమాద కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని నెల్లూరులో రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ఇదీ చూడండి:'అమ్మా నీకు వందనం' అంటూ అద్భుత సైకత శిల్పం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.