ETV Bharat / state

'100 రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్​ పప్పులు ఉడకవు - భవిష్యత్ అంతా బీఆర్​ఎస్​దే'

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 7:26 PM IST

Harish Rao Speech in Telangana Bhavan : రాష్ట్రంలో భవిష్యత్​ కాలమంతా బీఆర్​ఎస్​దేనని ఆ పార్టీ​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. బీఆర్​ఎస్​ ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేయడం కాంగ్రెస్​ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన జహీరాబాద్​ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Harish Rao
Harish Rao Speech in Telangana Bhavan

Harish Rao Speech in Telangana Bhavan : కాంగ్రెస్​ ప్రభుత్వం తీరు తాము మంచి చేయం, కేసీఆర్​ చేసిన మంచిని తుడి చేస్తామన్నట్లుగా ఉందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు(Harishrao) అన్నారు. కేసీఆర్​ ఎంతో ఆలోచించి దేశంలోనే వినూత్నంగా ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్​ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో నిర్వహించిన జహీరాబాద్​ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశాలు జరుగుతున్న తీరును చూస్తుంటే అధికారం కోల్పోయినప్పటికీ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే ఉందని ఆ పార్టీ సీనియర్​ నేత హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని దిగమింగుకుని పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదల నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తోందని అన్నారు. లోపాలను సమీక్షించుకుని పార్లమెంటు ఎన్నికల(Lok Sabha Election 2024) నాటికి వాటిని పునరావృతం చేయొద్దని పార్టీ పట్టుదలగా ఉందని చెప్పారు. తాము చేసిన అభివృద్ధితో పాటు దిల్లీలో కేంద్రంతో తెలంగాణ సమస్యలపై బీఆర్​ఎస్​ చేసిన పోరాటాన్ని ప్రజలకు గుర్తు చేసి ఓట్లు అడుగుదామని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్​ఎస్​ ఎంపీల సంఖ్య బలంగా ఉండాలని చెప్పారు.

బీఆర్​ఎస్​ ఎంపీలు లోక్​సభలో లేకపోతే కాంగ్రెస్​, బీజేపీలు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు ఉంటుందని ఆరోపించారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయని, తెలంగాణకు న్యాయం చేయడం కాంగ్రెస్​, బీజేపీ వల్ల కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సమస్యలను పరిష్కరించదు, కాంగ్రెస్​ నిలదీయదని ధ్వజమెత్తారు. తెలంగాణ పాలిట బీజేపీది మొండి చేయి, కాంగ్రెస్​ది తొండి చెయ్యి అని ఎద్దేవా చేశారు.

ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నిన్ను సీఎంని చేయరు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

'మన హక్కులు మనం దిల్లీలో సాధించుకోవాలంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీఆర్​ఎస్​కే పార్లమెంటు ఎన్నికల్లో పట్టం కట్టాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో మనం సఖ్యతగా లేమని సీఎం అంటున్నారు. ఈ పెద్ద మనిషి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏమన్నాడు, కేంద్రంలో ఎవరిని కలిసినా బీజేపీ బీఆర్​ఎస్​ కుమ్మక్కయ్యాయని అడ్డగోలు ఆరోపణలు చేశారు. ఎన్నిసార్లు కేంద్రంతో రాష్ట్ర సమస్యలపై మొరపెట్టుకున్నా, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే తయారైంది. అప్పుడు మనం ప్రభుత్వంలో ఉండగా ఇచ్చిన మెమోరాండంలనే కేంద్రానికి ఈ సీఎం ఇస్తున్నారని' మాజీ మంత్రి హరీశ్​ రావు ఎద్దేవా చేశారు.

BRS Zaheerabad Lok Sabha Preparatory Meeting : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించే బదులు బీఆర్​ఎస్​ కార్యకర్తలపై కక్ష సాధింపే కాంగ్రెస్​ ప్రభుత్వానికి ముఖ్యమని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. బీఆర్​ఎస్(BRS)​కు బలం ఉంది, కార్యకర్తల బలగం ఉంది, ఎవరూ అధైర్య పడొద్దని హితవు పలికారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటు చేసుకుంటే వాటి స్వరూపాన్ని కూడా మార్చాలని చూడడం దుర్మార్గం కాదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రజాపాలనలో దరఖాస్తుల్లో జాప్యం జరగకూడదు : ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటికి ఏ మాత్రం జాప్యం చేయకుండా మోక్షం కల్పించండని ప్రభుత్వాన్ని కోరారు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడతామంటే కుదరదని చెప్పారు. వంద రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్​ పప్పులు ఉడకవని బదులిచ్చారు. పార్టీ తరఫున తప్పులు జరిగి ఉంటే కార్యకర్తలు మన్నించాలని విన్నవించుకున్నారు. భవిష్యత్​ బీఆర్​ఎస్​దేనంటూ సమావేశాన్ని మాజీ మంత్రి హరీశ్​రావు ముగించారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలం : హరీశ్​ రావు

ఫిబ్రవరి నెల నుంచి ప్రతిరోజు కేసీఆర్​ తెలంగాణ భవన్​కు వస్తారు : హరీశ్ ​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.