ETV Bharat / state

ఫిబ్రవరి నెల నుంచి ప్రతిరోజు కేసీఆర్​ తెలంగాణ భవన్​కు వస్తారు : హరీశ్ ​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 3:27 PM IST

Harish Rao Speech at Telangana Bhavan : కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్లుగా నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. శాసనసభలో తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నేతలను ఉద్దేశించి హరీశ్​ రావు ప్రసంగించారు.

Harish Rao
Harish Rao Speech at Telangana Bhavan

Harish Rao Speech at Telangana Bhavan : బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఫిబ్రవరిలో ప్రతిరోజు తెలంగాణ భవన్​(Telangana Bhavan)కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని, త్వరలోనే ఆయన జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని ఆ పార్టీ సీనియర్​ నేత, మాజీ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నేతలను ఉద్దేశించి హరీశ్​ రావు(Harishrao) ప్రసంగించారు. కేసీఆర్​ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని చెప్పారు.

గర్భిణీలకు ఇచ్చే కేసీఆర్​ కిట్(KCR Kit Scheme)​ మీద కేసీఆర్​ గుర్తును కాంగ్రెస్​ ప్రభుత్వం చెరిపేస్తోందని, కిట్​ నుంచి తొలగించవచ్చేమోగానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్లుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని మాజీ మంత్రి తెలిపారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్​రావు చెప్పారు.

హరీశ్‌రావు వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి - అధికార పదవులపై సభలో రభస

తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశామే తప్ప ఎన్నడూ రాజీ పడలేదని హరీశ్​ రావు నాటి విషయాలను గుర్తు చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని మండిపడ్డారు. రైతు బంధు కూడా ఇంకా వేయలేదని ఆరోపించారు. ఇలా అయితే రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభివృద్ధి చేసినప్పటికీ దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని ఆయన తెలిపారు. ఇది స్పీడ్​ బ్రేకర్​ మాత్రమేనని వివరించారు.

BRS Preparatory meeting at Telangana Bhavan : తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, తమ సత్తా ఏమిటో చూపిద్దామని సన్నాహక సమావేశంలో శ్రేణులకు హరీశ్​రావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమష్ఠిగా పని చేయాలని ఆయన కోరారు. ఎవరూ అధైర్యపడొద్దని, ముందు ముందు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందని హరీశ్​రావు సమావేశంలో వెల్లడించారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలం : హరీశ్​ రావు

మహేందర్‌ రెడ్డి వర్సెస్​ రోహిత్‌ రెడ్డి - హరీశ్​రావు సాక్షిగా బీఆర్​ఎస్​లో బయటపడిన వర్గపోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.