ETV Bharat / state

Gold Seized at Shamsabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టివేత

author img

By

Published : Jul 18, 2023, 10:32 PM IST

Gold Seized at Shamsabad Airport
Gold Seized at Shamsabad Airport

Gold Smugglers in Hyderabad : విదేశాల నుంచి హైదరాబాద్​లోకి అక్రమంగా బంగారాన్ని కొంత మంది వ్యక్తులు తరలిస్తున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కువైట్​ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల దగ్గర నుంచి సుమారు రూ.కోటి విలువైన 1.725 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

Two Gold Smugglers Arrested in Shamshabad Airport : కొంతమంది తక్కువ కాలంలోనే ధనవంతుల కావాలనే ఉద్ధేశంతో అక్రమ మార్గాలని అన్వేషిస్తున్నారు. వారి తెలివితేటలను అక్రమంగా రవాణా చేస్తున్న సరుకును పోలీసులకు కనిపెట్టకుండా ఎలా తీసుకెళ్లాలనే ఆలోచిస్తున్నారు. వారు ఆ విధంగా ఆలోచించి ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా హైదరాబాద్​లో జరుగుతున్నాయి. విదేశాల నుంచి దొంగ మార్గాల ద్వారా బంగారాన్ని తీసుకువస్తున్నారు. ఈ విషయం కస్టమ్​ అధికారులు గుర్తించి వారిని పట్టుకుంటున్నారు. ఇటీవలే నలుగురిని పట్టుకోగా.. తాజాగా మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్​ చేశారు.

కస్టమ్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. : కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు కస్టమ్​ అధికారులకి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిని పరిశీలించగా.. నిందితుడి దగ్గర రూ.72.55లక్షలు విలువైన 1225 గ్రాములు బంగారం ఉందని గుర్తించారు. ఇదే విధంగా మరో వ్యక్తి కువైట్​ నుంచి డోహ మీదుగా హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడ్ని అధికారులు పరిశీలించారు. ఆ నిందితుడి దగ్గర రూ.30.51లక్షలు విలువైన 500 గ్రాములు బంగారం గుర్తించి.. పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల దగ్గర నుంచి మొత్తం కోటి రూపాయలు విలువ చేసే 1.725 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి ఇరువురిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

అదే విమానశ్రయంలో పట్టుబడిన మరో నలుగురు : ఈ విధంగానే ఈ నెల 10 నుంచి 12 తేదీల మధ్యలో నలుగురు నిందితులను కస్టమ్​ అధికారులు పట్టుకున్నారు. వారిని ఒక్కొక్కరి ఒక్కో విధంగా బంగారాన్ని అక్రమంగా తీసుకుని వచ్చారు. ఆ నిందితుల్లో ఒకడు బంగారాన్ని పేస్ట్​ రూపంలో చేసి.. మలద్వారం దగ్గర దాచుకొని ప్రయాణించాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు నిందితుడి దగ్గర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gold Smuggling Cases in Hyderabad : అలానే మరో మహిళ తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచింది. ఆ విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు. తన దగ్గర ఉన్న ఆభరణాలను తీసుకున్నారు. మరో ఇద్దరు ప్రయాణికులు ఈ విధంగానే బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేశారు. ఈ విధంగా అక్రమంగా బంగారాన్ని, గంజాయిని తరలించడం చట్టరీత్యా నేరమని.. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకి, పోలీసులకి తెలియజేయాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారని హెచ్చరించారు. ఆ నలుగురు నిందితుల కేసు వివరాల పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.