ETV Bharat / state

పీజీ వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై కమిటీ

author img

By

Published : Feb 23, 2023, 12:13 PM IST

Updated : Feb 23, 2023, 1:02 PM IST

doctor
డాక్టర్​

Committee on KMC student's suicide attempt : పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను విశ్లేషించడానికి ఎంజీఎం సూపరింటెండెంట్​ చంద్రశేఖర్​ నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటినీ వేశారు. వారు విశ్లేషించిన సమాచారాన్ని రిపోర్టు రూపంలో సీల్డ్​ కవర్​లో డీఎంఈకి ఇవ్వనున్నట్లు తెలిపారు.

Committee on KMC student's suicide attempt : వరంగల్​లోని పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీనీ ఎంజీఎం సూపరింటెండెంట్​ చంద్రశేఖర్ నియమించారు. ఈ కమిటీ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను విశ్లేషించనుంది. ​కమిటీ ఇచ్చిన రిపోర్టును సీల్డ్​ కవర్​లో పెట్టి.. డీఎంఈకి ఇవ్వనున్నారు.

విద్యార్థిని ఆరోగ్యంపై ఆరా తీసిన డీఎంఈ: కేఎంసీలో ఎటువంటి ర్యాగింగ్​ జరగలేదని.. తెలంగాణ వైద్యవిద్యా సంచాలకులు రమేశ్ ​రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని నిమ్స్​లో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన.. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. వెంటిలేటర్​పై చికిత్స కొనసాగుతుందని తెలిపారు. అప్పుడప్పుడు కళ్లు తెరుస్తోందని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమెను నిమ్స్​ వైద్యబృందంతో మాట్లాడి.. ఇక్కడి ఆస్పత్రిలో చేర్పించామని వెల్లడించారు.

వైద్యవిద్యార్థిని వైద్యానికి సంబంధించి ప్రభుత్వం అన్ని సహకారాలు అందిస్తోందని రమేశ్ రెడ్డి తెలిపారు. విద్యార్థిని ఇంజక్షన్​ తీసుకున్నట్లు ఒంటిమీద ఎక్కడా ఆనవాళ్లు లేవని నిమ్స్​ వైద్యులు తెలిపారని చెప్పారు. అవసరమైతే ఎక్మో ట్రీట్​మెంట్​కు కూడా సిద్ధమన్నారు. పీజీ స్థాయిలో అసలు ర్యాగింగ్​ అనేది ఉండదని రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ నివేదిక వచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్​ వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని వివరించారు.

"ర్యాగింగ్ అనేది పీజీ స్థాయిలో ఉండదు. ఎంబీబీఎస్ మొదటి రెండేళ్లలో ర్యాగింగ్ ఉంటే ఉండొచ్చు. వర్క్‌లోడ్ ఎక్కువ వల్ల ఈ విద్యార్థినికి గట్టిగా చెప్పానని సీనియర్ డాక్టర్ చెప్పారు. రెండు రోజుల క్రితం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చాం. కౌన్సిలింగ్ తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకే ప్రాంతంలో పని చేయలేదు. ప్రతి జూనియర్​ రాగానే సీనియర్​ ఏవిధంగా చెబుతారో ఇక్కడా కూడా అదే జరిగింది. కానీ ఆమె విషయంలో కొంచెం ఇబ్బందికరంగా జరిగినట్లు ఉంది." - రమేశ్ రెడ్డి, డీఎంఈ

ఇవీ చదవండి:

Last Updated :Feb 23, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.