ETV Bharat / state

తెరాసలో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్

author img

By

Published : Oct 26, 2022, 6:46 PM IST

Rapolu Ananda Bhaskar joining Trs
Rapolu Ananda Bhaskar joining Trs

Former MP Rapolu Ananda Bhaskar Joining Trs: భాజపా నేత రాపోలు ఆనంద భాస్కర్ తెరాసలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

Former MP Rapolu Ananda Bhaskar Joining Trs: భాజపా నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన తెరాసలో చేరారు. అంతకు ముందు భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ప్రకటించారు. అరుణ్‌ జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్‌ నాలుగున భాజపాలో చేరానని.. ఇంతకాలం పార్టీలో కలిసి ఉండే అవకాశం కల్పించినందుకు ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.

భాజపా వసుదైన కుటుంబ భావనకు పెద్ద పీట వేస్తుందనుకొన్నానని.. ఈ సూత్రానికి పార్టీ నిజంగా కట్టుబడి ఉందా అనే అనుమానాన్ని రాపోలు వ్యక్తం చేశారు. దేశంలో ఇబ్బందికరమైన విచ్ఛిన్నకరమైన రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయని రాపోలు ఆరోపించారు. పార్టీని వీడే సమయంలో తప్పులు ఎత్తి చూపడం తన లక్షణం కాదని ఆయన పేర్కొన్నారు.. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటారనే భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారిందని రాపోలు ఆనంద భాస్కర్ ఆక్షేపించారు. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం కూడా ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. చేనేతపై జీఎస్టీని విధించి ఆ రంగాన్ని భూస్థాపితం చేద్దామని భాజపా చూస్తోందని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఉచితాల కింద లెక్కగట్టడం తన మనసు లోతులను గాయపర్చిందని తెలిపారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో తనను విస్మరించారని రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.

తెరాసలో చేరికల జాతర: ఇప్పటికే గులాబీ అపరేషన్​ ఆకర్ష్​తో బిక్షమయ్యగౌడ్​ భాజపాను వీడి గులాబీ పార్టీలో చేరారు. ఆ షాక్‌ నుంచి కమలనాథులు తేరుకోకముందే స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ భాజపాను విడిచి కారెక్కారు. తాజాగా రాపోలు తెరాసలో చేరడంతో ఒక్క నెలరోజుల్లోనే నలుగురు పార్టీని విడిచినట్లు అయింది.

ఇవీ చదవండి: రాజాసింగ్‌పై పీడీ యాక్టును సమర్థించిన పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు

'అమృతగాథ' పుస్తకం ఆవిష్కరించిన మోదీ.. ఈనాడుపై ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.