Excise Department Searches in Telangana : ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ అలర్ట్.. మద్యం, డ్రగ్స్ సరఫరాపై పటిష్ఠ నిఘా

author img

By ETV Bharat Telangana Desk

Published : Oct 28, 2023, 2:05 PM IST

Excise Department Special Focus in Telangana

Excise Department Searches in Telangana : తెలంగాణ అబ్కారీ శాఖ.. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కొరఢా ఝుళిపిస్తోంది. భారీ ఎత్తున అనధికార మద్యంతో పాటు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటోంది. గడిచిన రెండు వారాల్లో రూ.18 కోట్లు విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అక్రమ మద్యం సరఫరా అధికమయ్యే అవకాశం ఉందని నిఘా పెంచింది.

Excise Department Searches in Telangana 2023 : ప్రలోభాలకు తావులేకుండా తెలంగాణ శాసన సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. నియమావళి ఉల్లంఘనలపై గతం కంటే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో అప్రమత్తమైన అబ్కారీ శాఖ(Excise Department) రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాలు, గుడుంబా తయారీ, మాదకద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బు, ఇతర ప్రలోభ వస్తువులు ఓటర్లకు పంపిణీ కాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలతో అబ్కారీ శాఖ ముందుకు సాగుతోంది.

Excise Department Focus on Liquor Supply in Telangana : ప్రధానంగా గుడుంబా తయారీ కేంద్రాలుగా అనుమానిస్తున్న జిల్లాలోని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్‌లల్లో గంజాయి సరఫరా, విక్రయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తనిఖీల్లో గోవా నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ ఆన్‌ ఎయిర్‌(LIQUOR ON AIR) తరలి వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మద్యం దుకాణాల్లో అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారన్న సమచారంతో.. దాడులు నిర్వహిస్తున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.

Telangana govt bans illegal liquor : అక్రమ మద్యానికి అడ్డుకట్ట.. ముమ్మర తనిఖీలు

Belt Shops in Telangana : రాష్ట్రంలో 40వేలకుపైగా బెల్ట్‌ షాపులు ఉంటాయని అబ్కారీ శాఖ, పోలీసు శాఖలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రలోని దాదాపు 1500 బెల్ట్‌ దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు.. కరీంనగర్‌, జగిత్యాల, కొత్తగూడెం, సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ అబ్కారీ శాఖ జిల్లాల పరిధిలో అమ్మకాలు తగ్గినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో 139 అబ్కారీ పోలీసు స్టేషన్లు ఉండగా ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సహాయ కమిషనర్ల నేతృత్వంలో ప్రతి స్టేషన్‌కు ఒక ప్రత్యేక బృందం పని చేసే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. 33 జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, పది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, మరో నాలుగు రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం నిరోదించేందుకు 21 ప్రాంతాలల్లో చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం విక్రయాల(Alcohol sales Telangana)పై నిఘా పెరగడంతో గుడుంబా తయారీ, సరఫరా పెరుగుతోందని.. వాటిపైనా దాడులు నిర్వహిస్తున్నామని వివరించారు.

16,700 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకుని 2755 కేసులు నమోదు చేసి.. 972 మందిని అరెస్టు చేయడంతోపాటు 151 వాహనాలను సీజ్‌ చేశామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. 1000 లీటర్లకుపైగా నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ స్వాధీనం చేసుకుని 90 కేసులు నమోదు చేసి 30 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. లక్షా 64 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం 980 కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్టు చేశామని అబ్కారీ శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రసాద్‌ తెలిపారు.

పండగ వేళ జోరుగా మద్యం విక్రయాలు.. అక్రమదారులపై ఎక్సైజ్​శాఖ నిఘా!

Excise Department Focus on Illegal Liquor Transport in Telangana : ఎన్నికల వేళ ఆబ్కారీ శాఖ అలర్ట్.. మద్యం అక్రమ అమ్మకాలు, రవాణాపై స్పెషల్​ ఫోకస్

Telangana Liquor Tender 2023 : ఒకే సంస్థ.. 5 వేల దరఖాస్తులు.. తెలంగాణలో వైన్సులు దక్కించుకునేందురు ఏకంగా రూ.100 కోట్లు వెచ్చించిన ఏపీ స్థిరాస్తి సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.