ETV Bharat / state

Excise Department Focus on Illegal Liquor Transport in Telangana : ఎన్నికల వేళ ఆబ్కారీ శాఖ అలర్ట్.. మద్యం అక్రమ అమ్మకాలు, రవాణాపై స్పెషల్​ ఫోకస్

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 7:25 AM IST

Excise Department Focus on Illegal Liquor Transport in Telangana : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అప్రమత్తమైంది. మద్యం అక్రమ అమ్మకాలు, అక్రమ రవాణా, నిల్వలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందుకోసం వాహనాల తనిఖీలతో పాటు మద్యం అక్రమ రవాణా చేస్తూ చిక్కిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తరచూ పట్టుబడే వారిపై పీడీ చట్టం నమోదు చేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు.

Telangana Assembly Elections 2023
Excise Department Latest Action in Telangana
Excise Department Focus on Illegal Liquor Transport in Telangana ఎన్నికల వేళ ఆబ్కారీ శాఖ అలర్ట మద్యం అక్రమ అమ్మకాలు రవాణాపై స్పెషల్​ ఫోకస్

Excise Department Focus on Illegal Liquor Transport in Telangana : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అక్రమ మద్యం కట్టడికి చర్యలు చేపడుతోంది. ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో సమీక్ష నిర్వహించింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటికే పలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆబ్కారీ శాఖ(Excise Department ) అక్రమ మద్యం, నిల్వలు, రవాణా కట్టడిపై దృష్టి సారించింది. ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే 29,663 మంది అనుమానాస్పద వ్యక్తులను ముందస్తుగా బౌండ్ చేసింది. 8,362 మంది హిస్టరీ షీటర్‌లపై నిఘా ఉంచింది. 14 మందిపై పీడీ చట్టం నమోదైంది.
Telangana govt bans illegal liquor : అక్రమ మద్యానికి అడ్డుకట్ట.. ముమ్మర తనిఖీలు

Checkposts to prevent illegal liquor Telangana : అంతర్రాష్ట్ర సరిహద్దు నిఘాను అధికారులు విస్తృతం చేశారు. అవసరమైతే నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేయడానికి సిద్దమవుతున్నారు. సరిహద్దుల్లోని రైలు మార్గాల్లో నిఘా ఉంచేందుకు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ మద్యం అరికట్టడంలో భాగంగా 21 చోట్ల అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది చోట్ల, తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఎనిమిది చోట్ల, తెలంగాణ-కర్ణాటక మధ్య నాలుగు చోట్ల, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్​ మధ్య ఒక చెక్‌ పోస్టును ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల్లోని సిబ్బంది 24 గంటలు పని చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి వాటిని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంతో అనుసంధానం చేశారు.

మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్​పోస్టుల వివరాలు..

చెక్​పోస్ట్​ చెక్​పోస్ట్​ల సంఖ్య
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్​ 8
తెలంగాణ-మహారాష్ట్ర 8
తెలంగాణ-కర్ణాటక 4
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ 1
మొత్తం 21

RS.1 Crore Rupees Seized by Excise Police : పోలీసు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల సమన్వయంతో 89 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల(Integrated check posts)ను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్ష తర్వాత.. 14,227 ఐడీ లిక్కర్, 1,71O కిలోల బెల్లం, 98.4 లీటర్ల మద్యం, 170 కిలోల గంజాయి, 21 వాహనాలతో పాటు ఒక కోటి 14 లక్షలు రూపాయల నగదును ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ.. అక్రమ మద్యం, రవాణా, నిల్వలపై ఎక్సైజ్‌ శాఖ ఉక్కుపాదం మోపింది. తనిఖీల్లో చిక్కితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Telangana Liquor Tender 2023 : ఒకే సంస్థ.. 5 వేల దరఖాస్తులు.. తెలంగాణలో వైన్సులు దక్కించుకునేందురు ఏకంగా రూ.100 కోట్లు వెచ్చించిన ఏపీ స్థిరాస్తి సంస్థ

Action Illegal Liquor in TS : 'ఇతర రాష్ట్రాల మద్యం తెస్తే ఊరుకునే ప్రసక్తే లేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.